Allu Arjun: సాధారణంగా ఎక్కడైనా స్టార్ సెలబ్రిటీల గురించి వింటాం. ఈ క్రమంలోనే వాళ్ల కుటుంబ సభ్యులు, పిల్లలు కూడా ఫేమస్ అవుతారు. కానీ మనం ఇక్కడ మాట్లాడుకునేది మాత్రం ఓ స్టార్ పని మనిషి గురించి. అదేంటి.? స్టార్ పని మనిషి అనుకుంటున్నారా? నిజమేనండి. ఈమె టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో ఇంటిలో పని మనిషి. అదికూడా నార్మల్ పని మనిషి కాదండోయ్ స్టార్ పని మనిషి. ఇంతకీ ఆమె ఎవరు? స్టార్ పనిమనిషిగా ఎలా మారింది? అనే విషయాలను తెలుసుకుందాం.
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టైలిష్ స్టార్ గా పేరుగాంచిన అల్లు అర్జున్ ఇంట్లో పని మనిషి. ఆమె పేరు అశ్విని. ఈమె గురించి అందరికీ తెలియకపోయినా బన్నీ ఇంటికి వెళ్లే వారికి మాత్రం అశ్విని గురించి తెలిసే ఉంటుంది. అల్లు అర్జున్ కుమారుడు అయాన్, కూతురు అర్హలను ఈమె చూసుకుంటుంది. చాలా వీడియోల్లో కనిపించిన అశ్విని కోసం బన్నీ సైతం ఇన్ స్టాలో ఓ వీడియో చేశారు. అందులో తనకు ఎంతమంది ఫాలోవర్స్ కావాలి అంటే 30 వేల మంది ఫాలోవర్స్ కావాలని అశ్విని అడుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ అమ్మాయికి ఇన్ స్టాలో ఏకంగా లక్షా 33 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో అతి కొద్ది రోజుల్లోనే అశ్విని ఇన్ స్టాగ్రామ్ లో బాగా పాపులర్ అయిందని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ చేసిన వీడియోతో అశ్విని ఇన్ స్టాగ్రామ్ స్టార్ గా మారిపోయిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
తాజాగా మెగా ఫ్యామిలీ బెంగళూరులో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈవెంట్ ను సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు అల్లు ఫ్యామిలీతో అశ్విని కూడా వెళ్లింది. అక్కడ సెలబ్రేషన్స్ లో భాగంగా అల్లు అరవింద్, శ్రీజలతో దిగిన ఫొటోలను అశ్విని ఇన్ స్టా వేదికగా పంచుకుంది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు అశ్వినిని స్టార్ పని మనిషి అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.