https://oktelugu.com/

బాక్సాఫీస్ వార్.. చిరు వర్సెస్ బాలయ్య?

టాలీవుడ్ ఇండస్ట్రీ కొద్దిరోజులుగా షూటింగులు లేక బోసిపోయింది. కరోనా నిబంధనలు పాటిస్తూ దర్శక, నిర్మాతలు కొత్త సినిమాలను ప్రారంభిస్తుండటంతో మళ్లీ సందడి కన్పిస్తోంది. ఇక టాలీవుడ్లోని ఇద్దరు అగ్రహీరోలు బాక్సాఫీస్ వార్ కు సిద్ధం అవుతుండటంతో అభిమానుల్లో జోష్ మొదలైంది. ఈసారి కూడా తమ హీరోదే పైచేయి అంటే.. తమ హీరోదేనని అభిమానులు చర్చించుకుంటున్నారు. Also Read: రాంచరణ్ నయా లుక్.. ‘అల్లూరి’లా ఒదిగిపోయాడు..! మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి బాలకృష్ణ సినిమాలు ఎన్నోసార్లు బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి. ఒకసారి […]

Written By:
  • NARESH
  • , Updated On : September 24, 2020 / 10:23 AM IST
    Follow us on


    టాలీవుడ్ ఇండస్ట్రీ కొద్దిరోజులుగా షూటింగులు లేక బోసిపోయింది. కరోనా నిబంధనలు పాటిస్తూ దర్శక, నిర్మాతలు కొత్త సినిమాలను ప్రారంభిస్తుండటంతో మళ్లీ సందడి కన్పిస్తోంది. ఇక టాలీవుడ్లోని ఇద్దరు అగ్రహీరోలు బాక్సాఫీస్ వార్ కు సిద్ధం అవుతుండటంతో అభిమానుల్లో జోష్ మొదలైంది. ఈసారి కూడా తమ హీరోదే పైచేయి అంటే.. తమ హీరోదేనని అభిమానులు చర్చించుకుంటున్నారు.

    Also Read: రాంచరణ్ నయా లుక్.. ‘అల్లూరి’లా ఒదిగిపోయాడు..!

    మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి బాలకృష్ణ సినిమాలు ఎన్నోసార్లు బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి. ఒకసారి బాలయ్య విజయం సాధిస్తే మరోసారి చిరంజీవి సినిమాలు పైచేయి సాధించేవి. బాక్సాఫీస్ వద్ద ఎక్కువగా చిరంజీవి సినిమాలే కలెక్షన్లు సాధించినట్లు రికార్డులను బట్టి తెలుస్తోంది. చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ-150’తోనూ బాలయ్య పోటీపడటం విశేషం.

    ఇటీవల బాలయ్య నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’.. మెగాస్టార్ నటించిన ‘ఖైదీ-150’ మూవీలో ఒకేసారి రిలీజయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా మంచి కలెక్షన్లు సాధించగా.. చిరంజీవి మూవీనే పైచేయి సాధించినట్లు కన్పించింది. ఇక తాజాగా మరోసారి వీరిద్దరు బాక్సాఫీస్ వార్ కు సిద్ధమవుతున్నారనే ప్రచారం ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.

    చిరంజీవి-కోరటాల శివ కాంబినేషన్లో ‘ఆచార్య’ మూవీ రాబోతుంది. అదేవిధంగా బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్లో ఓ మూవీ రాబోతుంది. ఈ రెండు చిత్రాలు కరోనాతో వాయిదాపడిన సంగతి తెల్సిందే. ఈ రెండు సినిమాలు కూడా నవంబర్లో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ చేసుకుంటున్నాయి. ‘ఆచార్య’ సినిమాను ఏప్రిల్ రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది.

    Also Read: కరోనాతో నటుడు కోసూరి వేణుగోపాల్ మృతి

    ఇక బాలకృష్ణ సినిమా కూడా ఏప్రిల్ 30న రిలీజ్ చేయాలని దర్శకుడు బోయపాటి శ్రీను భావిస్తున్నారట. సింహా రిలీజ్ డేట్ కు బాలయ్య సినిమాను రిలీజ్ చేస్తే సెంటిమెంట్ కలిసి వస్తుందని బోయపాటి అనుకుంటున్నాడు. దీంతో బాక్సాఫీస్ వద్ద వీరిద్దరి సినిమాలు పోటీపడే అవకాశం ఉందనే టాక్ విన్పిస్తోంది. ఈసారైనా బాలకృష్ణ చిరంజీవిపై పైచేయి సాధిస్తారో లేదా వేచి చూడాల్సిందే..!