Pawan-Prabhas Box Office Kings: ప్రస్తుతం నడుస్తున్న ఓటీటీ ట్రెండ్ లో ఒక సినిమాకు ఓపెనింగ్ వసూళ్లు తీసుకొని రావడమంటే సాధారణమైన విషయం కాదు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే, ప్రస్తుతం భారీ కాంబినేషన్ లేదా ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్ లేకపోతే దారుణమైన ఫలితాన్ని చూడాల్సి వస్తుంది. రీసెంట్ గా విడుదలైన ‘వార్ 2′(War 2 Movie) అందుకు ఒక ఉదాహరణ. విడుదలకు ముందు నుండే ఈ సినిమా పై ఆశించిన స్థాయిలో హైప్ లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి, ఎన్టీఆర్ అద్భుతమైన పవర్ ఫుల్ స్పీచ్ ని అందించి ఈ సినిమాపై హైప్ ని పెంచే ప్రయత్నం చేశాడు. కానీ వర్కౌట్ అవ్వలేదు. ఫలితంగా అంత భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం అయినప్పటికీ మొదటి రోజు వసూళ్లు దారుణంగా వచ్చాయి. 15 ఏళ్ళ క్రితం స్టార్ హీరో కి వచ్చే ఓపెనింగ్ వసూళ్లు కూడా ఈ చిత్రానికి రాలేదంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అనేది.
హీరోలను చూసి జనాలు థియేటర్స్ కి వచ్చే రోజులు పొయ్యాయి. కేవలం కొంతమంది మాత్రమే కంటెంట్ కి సంబంధం లేకుండా మొదటి రోజు వసూళ్లను రాబడుతున్నారు.వారిలో మన తొలీవూడ్ నుండి ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ మాత్రమే ఉన్నాడని అంటున్నారు ట్రేడ్ పండితులు . డైరెక్టర్ ఎవరైనా కానీ అనవసరం, మొదటి రోజు మొదటి ఆటకు సంబంధించిన టిక్కెట్లు తెగాల్సి వస్తుంది . అందుకే తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి ఓపెనింగ్స్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కి వచిన్నట్టు గా ఎవరికీ రావడ లేదం అంటున్నారు. కేవలం లో ఈ సినిమానే కాదు, గతం లో ఆయన హీరో గా నటించిన బ్రో, వకీల్ సాబ్ వంటి చిత్రాలకు కూడా భారీ ఓపెనింగ్స్ పెట్టాడు. ఇక పవన్ కళ్యాణ్ తర్వాత ఆ స్థానం లో నిల్చున్న మరో హీరో రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas).
Also Read:‘వార్ 2′ ఎఫెక్ట్..’దేవర 2’ ని ఆపేసిన ఎన్టీఆర్..మరో యంగ్ హీరో కోసం కొరటాల ప్రయత్నాలు!
ఈయనకు కూడా ప్రస్తుతం ఇదే రేంజ్ ట్రెండ్ నడుస్తుంది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, హిందీ మరియు ఇతర భాషల్లో కూడా భారీ ఓపెనింగ్స్ ని రాబడుతున్నాడు. రాధే శ్యామ్ సినిమా ఒక్కటే కాస్త ఇతర భాషల్లో తడబడింది కానీ, ఆయన మిగిలిన సినిమాలు మాత్రం రికార్డు స్థాయి ఓపెనింగ్ గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ మారుతీ తో కలిసి ‘రాజా సాబ్’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు హను రాఘవపూడి తో ఒక సినిమా, సందీప్ వంగ తో స్పిరిట్ వంటి చిత్రాలను లైన్ లో పెట్టాడు. ఈ సినిమాలకు కూడా బంపర్ ఓపెనింగ్ దక్కే అవకాశాలు ఉన్నాయి.