Homeజాతీయ వార్తలుBengaluru Success Story: వైఫల్యాల నుంచి కోటి రూపాయల విజయం.. ఒక కల నెరవేరిన...

Bengaluru Success Story: వైఫల్యాల నుంచి కోటి రూపాయల విజయం.. ఒక కల నెరవేరిన కథ

Bengaluru Success Story: టాలెంట్‌ ఎవడబ్బ సొత్తు కాదు.. ఎవరు ఆపినా ఆగదు.. దాచినా దాగదు. స్పష్టమైన లక్ష్యం.. చేరుకోవాలన్న సంకల్పం ఉంటే.. ఎంత కష్టమైనా.. గెలుపు తీరం చేరతాం. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ యువకుడు తన లక్ష్యం చేరుకోవడానికి 300 వైఫల్యాలు ఎదుర్కొన్నాడు. కానీ, ఫినిక్స్‌ పక్షిలా ఓటమిని అంగీకరించలేదు. చివరకు గెలుపే తల వంచింది. విజయమై వరించింది. చివరకు లండన్‌లోని ఒక ట్రేడింగ్‌ సంస్థలో రూ.1.03 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు.

Also Read:  ఏం జరిగినా సరే.. అంతా మీ మంచికే.. గుర్తుంచుకోండి..

సాధారణ నుంచి అసాధారణ లక్ష్యం వైపు..
ఈ యువకుడు అసాధారణమైన మెరిట్‌ విద్యార్థి కాదు. బీటెక్‌లో బ్యాక్‌లాగ్‌లు, కంప్యూటర్‌ సైన్స్‌లో సీటు దక్కకపోవడం వంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ, అతని లక్ష్యం స్పష్టంగా ఉంది. ఫైనాన్షియల్‌ రంగంలో కెరియర్‌. ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చదివినప్పటికీ, టీనేజ్‌లోనే స్టాక్‌ మార్కెట్, ఫైనాన్షియల్‌ మార్కెట్లపై ఆసక్తిని పెంచుకున్నాడు. ఈ ఆసక్తి అతన్ని స్వయం–అభ్యాసం వైపు నడిపించింది, ఇది అతని విజయానికి మూలస్తంభంగా నిలిచింది. ఒక రంగంపై లోతైన ఆసక్తి, నిరంతర అభ్యాసం ద్వారా అసాధారణ ఫలితాలు సాధించవచ్చు అని నిరూపించాడు.

300 తిరస్కరణలు..
ఈ యువకుడు ఫైనాన్షియల్‌ రంగంలో ఇంటర్న్‌షిప్‌లు, ఉద్యోగాల కోసం వందల కొద్దీ దరఖాస్తులు పంపాడు, కానీ 300 సార్లు తిరస్కరణలు ఎదురయ్యాయి. వైఫల్యాలను ఎదుర్కొన్నప్పుడు చాలామంది ఆశలు వదిలేస్తారు, కానీ ఈ యువకుడు పట్టుదలతో ముందుకు సాగాడు. తిరస్కరణలను అవకాశాలుగా మార్చుకుని, తన నైపుణ్యాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాడు. ఫైనాన్షియల్‌ మోడలింగ్, కంపెనీ వాల్యూయేషన్‌ వంటి కోర్సులు చేశాడు. ఈ నిరంతర ప్రయత్నం చివరకు ‘క్వాంట్‌ రిసెర్చ్‌’ అనే సంస్థలో ఇంటర్న్‌షిప్‌గా ఫలించింది, ఇది అతని కెరియర్‌కు ఒక మలుపు తిప్పింది.

ఇష్టమైన రంగంలో అర్హతల సాధన..
ఈ యువకుడు తన ఆసక్తి ఉన్న ఫైనాన్షియల్‌ రంగంలో నైపుణ్యం సాధించడానికి అవసరమైన అన్ని అర్హతలను సంపాదించాడు. స్టాక్‌ మార్కెట్‌ సంక్లిష్టతలను అర్థం చేసుకున్నాడు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల గతిశీలతను గ్రహించాడు. ‘క్వాంట్‌ రిసెర్చ్‌’లో ఇంటర్న్‌షిప్‌ సమయంలో, ఒక సంవత్సరంలోనే షేర్‌ మార్కెట్‌ సారాంశాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్నాడు. ఈ నైపుణ్యం లండన్‌లోని ఒక ప్రముఖ ట్రేడింగ్‌ సంస్థ దృష్టిని ఆకర్షించి, అతనికి రూ.1.03 కోట్ల వేతనంతో ఉద్యోగం అందించింది. బీటెక్‌ పూర్తయిన తర్వాత రూ.7.5 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగ ఆఫర్‌ వచ్చినప్పటికీ, అతను దాన్ని తిరస్కరించాడు. తన లక్ష్యం గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్లలో కెరియర్‌ కావడంతో, ఆ ఆఫర్‌ అతని ఆకాంక్షలకు సరిపోలేదు. ఈ నిర్ణయం అతని స్వప్నాన్ని నిజం చేసింది.

Also Read:  పువ్వులే అని తీసి పారేయకండి.. 15వేల కోట్ల వ్యాపారం సాగుతోంది!

సోషల్‌ మీడియాలో వైరల్‌..
ఈ యువకుడు తన విజయ కథను తన పేరు వెల్లడించకుండా రెడ్డిట్‌లో పంచుకున్నాడు. ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది. అతని కథ లక్షలాది మందిని స్ఫూర్తిపరిచింది. ముఖ్యంగా సామాన్య నేపథ్యం నుంచి వచ్చిన యువతను. అతని అనామకత్వం అతని వినయాన్ని సూచిస్తుంది. కానీ అతని కథ శక్తి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular