Pareshan- Ahimsa: ఒకే దెబ్బకి రెండు పిట్టలు..పాపం దగ్గుపాటి ఫ్యామిలీ కి ఇది మామూలు షాక్ కాదు!

సురేష్ ప్రొడక్షన్స్ నుండి కొద్దీ రోజుల క్రితమే దగ్గుపాటి సురేష్ బాబు రెండవ కుమారుడు దగ్గుపాటి అభిరామ్ హీరో గా 'అహింస' అనే చిత్రం విడుదలైంది, తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మరో పక్క రానా దగ్గుపాటి నిర్మాతగా వ్యవహరించిన తెలంగాణ బ్యాక్ డ్రాప్ మూవీ 'పరేషాన్' కూడా 'అహింస' చిత్రం తో పాటే విడుదల అయ్యింది.

Written By: Vicky, Updated On : June 5, 2023 4:08 pm

Pareshan- Ahimsa

Follow us on

Pareshan- Ahimsa: ఈ ఏడాది సమ్మర్ సీజన్ టాలీవుడ్ కి ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి, విడుదలైన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడం, నిర్మాతలకు భారీ నష్టాలను కలిగించడమే మనం ఇప్పటి వరకు చూసాము. కేవలం ‘విరూపాక్ష’ మరియు ‘దసరా’ చిత్రాలు మాత్రమే ఈ సమ్మర్ లో బాక్స్ ఆఫీస్ హిట్స్ గా నిలిచాయి. ఇదంతా పక్కన పెడితే ఒక కుటుంబం నుండి రెండు నిర్మాణ సంస్థలు, ఒకేరోజు విడుదల చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాలను అందుకోవడం కూడా ఈ సీజన్ లోనే మనం చూసాము.

సురేష్ ప్రొడక్షన్స్ నుండి కొద్దీ రోజుల క్రితమే దగ్గుపాటి సురేష్ బాబు రెండవ కుమారుడు దగ్గుపాటి అభిరామ్ హీరో గా ‘అహింస’ అనే చిత్రం విడుదలైంది, తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మరో పక్క రానా దగ్గుపాటి నిర్మాతగా వ్యవహరించిన తెలంగాణ బ్యాక్ డ్రాప్ మూవీ ‘పరేషాన్’ కూడా ‘అహింస’ చిత్రం తో పాటే విడుదల అయ్యింది.

‘పరేషాన్’ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా రెండు కోట్ల రూపాయిల వరకు జరిగింది. మూడు రోజులకు కలిపి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కచ్చితంగా నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టాలి, అది దాదాపుగా అసాధ్యం అని చెప్తున్నారు ట్రేడ్ పండితులు. మరో పక్క సురేష్ బాబు నిర్మించిన ‘అహింస’ చిత్రం పరిస్థితి ఇంతకంటే దారుణంగా తయారు అయ్యింది. ఈ సినిమాని నిర్మించడానికి సురేష్ బాబు దాదాపుగా 12 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేసాడు.

కానీ తొలి మూడు రోజుల్లో ఈ సినిమాకి కనీసం కోటి రూపాయిల గ్రాస్ కూడా రాలేదట. తన సినిమా బడ్జెట్ ని 5 కోట్లకు మించి దాటించే అలవాటు లేని సురేష్ బాబు, ఈ సినిమా కోసం ఏకంగా 12 కోట్ల రూపాయిలు ఖర్చు చేసి చేతులు కాల్చుకున్నాడు. అలా ఒకే దెబ్బకి రెండు పిట్టలు సామెత లాగ, ఒకే కుటుంబం నుండి ఒకే రోజు విడుదలైన రెండు సినిమాలు దగ్గుపాటి ఫ్యామిలీ కి చేదు జ్ఞాపకాలను మిగిలించింది.