Bosco Martin : గత ఏడాది ఎన్టీఆర్(Junior NTR) హీరో గా నటించిన ‘దేవర'(Devara Moviee) చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విడుదలకు ముందు ఈ సినిమా మేనియా మామూలు రేంజ్ లో ఉండేది కాదు. ఎన్టీఆర్ సినిమాలకు విడుదలకు ముందు ఇలాంటివి చాలా కామన్ కానీ, అనిరుద్ అందించిన అద్భుతమైన పాటలు ఈ సినిమాపై అంచనాలను కనీవినీ ఎరుగని రేంజ్ లో ఏర్పడేలా చేశాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ జాన్వీ కపూర్ తో కలిసి చేసిన ‘చుట్టమల్లే'(Chuttamalle) పాట ఒక సునామీ ని సృష్టించింది. గడిచిన దశాబ్ద కాలంలో ఈ పాట క్లిక్ అయిన రేంజ్ ఏ పాట కూడా క్లిక్ అవ్వలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మిలియన్ల కొద్దీ యూట్యూబ్ వ్యూస్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ఈ పాట మీద వచ్చాయి.
Also Read : వెంకీ అట్లూరి కి ఎందుకు మన టాలీవుడ్ హీరోలు అవకాశం ఇవ్వడం లేదు?
ఇప్పటికీ ఈ పాట ట్రెండింగ్ లోనే ఉంది. అలాంటి సెన్సేషన్ సృష్టించిన ఈ పాటకు కొరియోగ్రాఫర్ గా బోస్కో మార్టిన్(Bosco Martin) వ్యవహరించాడు. ఇప్పటి వరకు ఈయన బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ పాటలకు కొరియోగ్రఫీ చేశాడు. ‘బ్యాడ్ న్యూస్’ అనే చిత్రం లో ‘తౌబా..తౌబా’ అనే పాట ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ పాటకు కొరియోగ్రఫీ చేసింది ఈయనే. అయితే ‘చుట్టమల్లే’ పాటకు తనకు ఇసుమంత క్రెడిట్స్ కూడా దేవర టీం ఇవ్వలేదని బోస్కో రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఈ పాట వినసొంపుగా ఉంది, అందులో ఎలాంటి సందేహం లేదు. అదే సమయంలో చూసేందుకు ఎంతో అందంగా కూడా ఈ పాట ఉన్నది. ఆ రేంజ్ లో ఈ పాట సూపర్ హిట్ అవ్వడానికి కొరియోగ్రఫీ కూడా ఒక ప్రధాన కారణం. కానీ దేవర టీం తనని మర్చిపోయిందని, ఒక్కరు కూడా తన పేరు ని ప్రస్తావించలేదని బోస్కో మార్టిన్ వాపోయాడు.
కనీసం జాన్వీ కపూర్ అయినా తనని గుర్తిస్తుందని ఆశించాను కానీ, ఆమె కూడా తన పేరు ని ప్రస్తావించలేదు అంటూ బోస్కో మార్టిన్ చెప్పుకొచ్చాడు. ఒక పాట భారీ హిట్ అయ్యినప్పుడు, కచ్చితంగా కొరియోగ్రాఫర్ కి కొంత క్రెడిట్ ఇవ్వాలని, కానీ ఈమధ్య కాలంలో ఇండస్ట్రీ లో అది కొరవడింది అని, కానీ తనని బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ బాగా గుర్తించాడని, ‘తౌబా తౌబా’ సాంగ్ అంత పెద్ద హిట్ అయ్యినందుకు ఆయన తనకు క్రెడిట్స్ ఇస్తూ అనేక సందర్భాల్లో మాట్లాడిన విషయాన్నీ గుర్తు చేసుకున్నాడు బోస్కో. ఆయన మాట్లాడిన మాటల్లో కూడా అర్థం ఉంది, ఈ పాటకు కొరియోగ్రాఫర్ గా తనకు గుర్తింపు ఇచ్చి ఉంటే, నేడు బోస్కో కి కూడా అవకాశాలు క్యూలు కట్టేవి కదా అని కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.