Border 2 Movie 4 Days Collections: గత ఏడాది డిసెంబర్ నెల నుండి బాలీవుడ్ ఇండస్ట్రీ కి మహర్దశ మొదలైంది. ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రెండు నెలల నుండి ఈ సినిమా థియేటర్స్ లో అద్భుతమైన రన్ ని సొంతం చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంది. ఈ సినిమా రన్ ని మ్యాచ్ చేయడం ఇప్పట్లో కష్టమని అంతా అనుకున్నారు. కానీ నాలుగు రోజుల క్రితం విడుదలైన సీనియర్ హీరో సన్నీ డియోల్(Sunny Deol) నటించిన ‘బోర్డర్ 2′(Border 2 Movie) విడుదలైంది. 1997 వ సంవత్సరం లో సన్నీ డియోల్ హీరో గా నటించిన ‘బోర్డర్’ చిత్రం సంచలనం సృష్టించింది. అప్పటి వరకు ఇండస్ట్రీ లో ఉన్నటువంటి రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. అలాంటి సినిమాకు సీక్వెల్ ని ప్రకటించినప్పటి నుండే ఈ సినిమా పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరాయి.
ఆ అంచనాలకు తగ్గట్టుగానే మొదటి రోజు మొదటి ఆట నుండే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం తో కళ్ళు చెదిరే వసూళ్లు ఈ చిత్రానికి నమోదు అయ్యాయి. బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ చిత్రానికి మొదటి నాలుగు రోజులకు కలిపి 193 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. ఇది కేవలం ఇండియన్ బాక్స్ ఆఫీస్ నుండి మాత్రమే. మొదటి రోజు 32.10 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి రెండవ రోజు 40.59 కోట్ల రూపాయిలు, మూడవ రోజు 57.20 కోట్లు, నాల్గవ రోజున ఏకంగా 63.59 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఒక సీనియర్ హీరో కి ఈ రేంజ్ నెట్ వసూళ్లు రావడం అనేది ఈమధ్య కాలంలో బాలీవుడ్ హిస్టరీ లో ఎప్పుడూ జరగలేదు.
ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రేంజ్ నెట్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి ఓవర్సీస్ లో మాత్రం అనుకున్నంత రేంజ్ వసూళ్లను రాబట్టలేకపోయింది ఈ చిత్రం. మొదటి నాలుగు రోజులకు కలిపి ఈ చిత్రానికి ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ వద్ద 26 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ‘ధురంధర్’ చిత్రానికి ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటి వరకు 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అది కూడా మిడిల్ ఈస్ట్ దేశాల్లో విడుదల లేకుండానే. ‘బోర్డర్ 2’ కి ఆ దేశాల్లో విడుదల లేదు. కానీ ‘ధురంధర్’ కి ఉన్న రేంజ్ ట్రెండ్ అయితే లేదు. కానీ ఓవరాల్ గా ఈ చిత్రం ఫుల్ రన్ లో వరల్డ్ వైడ్ గా వెయ్యి కోట్ల గ్రాస్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.