అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. మంత్రి సోమవారం వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్ష సూచన ఉందన్నారు. దీంతో స్థానిక అధికారులు అప్రమత్తమై ప్రజలకు అవసరమైన సహకారం అందించాలన్నారు. లోతట్టు ప్రాంతాలు నీటితో నిండక ముందే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి తెలిపారు.

Written By: Suresh, Updated On : October 19, 2020 3:58 pm
Follow us on