https://oktelugu.com/

రాజమౌళికి సీనియర్ల పట్ల గౌరవం లేదట !

నేషనల్ లెవల్లో దర్శక ధీరుడు అనే బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం అంటే మాటలా… అసలు ఒక తెలుగు సినిమా పదిహేను వందల కోట్లు కలెక్ట్ చేస్తోందని ఎవరైనా ఉహించగలరా ? అందుకే రాజమౌళిని నేషనల్ డైరెక్టర్ అని కీర్తిస్తోన్నారు. గతంలో ఏ టాలీవుడ్ డైరెక్టర్ కు సాధ్యం కానీ రేంజ్ ను సాధించిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. అయితే రాజమౌళి టోటల్లీ అన్‌ప్రొఫెషనల్‌ అని.. సీనియర్ల పట్ల గౌరవం లేదని అనిపిస్తోందని బోనీకపూర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 1, 2021 / 04:13 PM IST
    Follow us on


    నేషనల్ లెవల్లో దర్శక ధీరుడు అనే బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం అంటే మాటలా… అసలు ఒక తెలుగు సినిమా పదిహేను వందల కోట్లు కలెక్ట్ చేస్తోందని ఎవరైనా ఉహించగలరా ? అందుకే రాజమౌళిని నేషనల్ డైరెక్టర్ అని కీర్తిస్తోన్నారు. గతంలో ఏ టాలీవుడ్ డైరెక్టర్ కు సాధ్యం కానీ రేంజ్ ను సాధించిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. అయితే రాజమౌళి టోటల్లీ అన్‌ప్రొఫెషనల్‌ అని.. సీనియర్ల పట్ల గౌరవం లేదని అనిపిస్తోందని బోనీకపూర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు మరోసారి చేశాడు.

    Also Read: రోబో స్టోరీ వివాదంలో శంకర్ మీద నాన్ బెయిలబుల్ వారెంట్

    రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అక్టోబర్ 13న విడుదల అని ప్రకటించగానే బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఫైర్ అయ్యాడు. అజయ్ దేవగన్ హీరోగా బోనీ కపూర్ నిర్మించిన “మైదాన్” సినిమా కూడా అక్టోబర్ 13న విడుదల అని బోనీ కపూర్ ఇంతకుముందే ప్రకటించాడు. ‘ఆర్ఆర్ఆర్’లో అజయ్ దేవగన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరి, అజయ్ నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైతే నార్త్ ఇండియన్ మార్కెట్ లో మాకు నష్టం వస్తోందని బోనీ కపూర్ ఫీల్ అవుతున్నాడు.

    Also Read: స్టార్ హీరో నుండి “A” ట్రైలర్ !

    రాజమౌళి సినిమా అంటే.. దేశమంతా పెద్ద ఎత్తున విడుదల అవుతుంది కాబట్టి.. కచ్చితంగా ‘మైదాన్’కి పెద్ద దెబ్బే.. అందుకే బోణీ కపూర్ రాజమౌళి పై సీరియస్ అవుతున్నాడు. రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యున్నత భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా పై పాన్ ఇండియా లెవల్లో ఫుల్ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఈ సినిమా నుండి ఇద్దరు హీరోల టీజర్ లకు సంబంధించిన వీడియోలు కూడా జనాన్ని ఒక ఊపు ఉపేశాయి. కానీ ‘మైదాన్’ సినిమా డేట్ ని మార్చాల్సిన పరిస్థితి ఇప్పుడు తప్పనిసరి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్