https://oktelugu.com/

హీరో సూర్య ఆఫీస్ లో బాంబు అంటూ కాల్.. చివరకు..?

ఈ మధ్య కాలంలో చాలామంది ప్రముఖులను టార్గెట్ చేసి బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. గుర్తింపు కోసం చేస్తున్నారో లేక మరేదైనా కారణంతో చేస్తున్నారో తెలీదు కానీ బెదిరింపు కాల్స్ మాత్రం సర్వసాధారణం అయిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు వెలుగులోకి రాకపోయినా తమిళనాడులో మాత్రం స్టార్ హీరోలకు, స్టార్ డైరెక్టర్లకు ఫోన్లు చేసి అజ్ఞాత వ్యక్తులు బాంబు పెట్టామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. Also Read : ‘మోస‌గాళ్లు’ స్కామ్ బ‌య‌ట‌పెట్ట‌నున్న అల్లు అర్జున్‌! ఈ ఫేక్ బెదిరింపు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 29, 2020 / 12:50 PM IST
    Follow us on

    ఈ మధ్య కాలంలో చాలామంది ప్రముఖులను టార్గెట్ చేసి బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. గుర్తింపు కోసం చేస్తున్నారో లేక మరేదైనా కారణంతో చేస్తున్నారో తెలీదు కానీ బెదిరింపు కాల్స్ మాత్రం సర్వసాధారణం అయిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు వెలుగులోకి రాకపోయినా తమిళనాడులో మాత్రం స్టార్ హీరోలకు, స్టార్ డైరెక్టర్లకు ఫోన్లు చేసి అజ్ఞాత వ్యక్తులు బాంబు పెట్టామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.

    Also Read : ‘మోస‌గాళ్లు’ స్కామ్ బ‌య‌ట‌పెట్ట‌నున్న అల్లు అర్జున్‌!

    ఈ ఫేక్ బెదిరింపు కాల్స్ వల్ల పోలీసుల సమయం వృథా అవుతోంది. నిన్న స్టార్ హీరో సూర్యకు అజ్ఞాత వ్యక్తులు ఫోన్ చేసి ఆఫీసులో బాంబ్ పెట్టామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో సూర్య వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చెన్నైలోని అల్వార్‌పేట దగ్గర ఉన్న ఆఫీసుకు పోలీసులు చేరుకుని అక్కడ పరిశీలించగా అక్కడ ఎలాంటి బాంబు లేదని తేలింది. ఎవరో కావాలనే సూర్యకు కాల్ చేశారని పోలీసులు భావిస్తున్నారు.

    పోలీసులు సూర్యకు కాల్ వచ్చిన నంబర్ ను ట్రేస్ చేసే పనిలో పడ్డారు. కొన్ని రోజుల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్ ను కు కూడా కొన్ని రోజుల క్రితం ఇదే విధంగా ఫేక్ కాల్ భయపెట్టింది. విజయ్, అజిత్, డైరెక్టర్ మణిరత్నంలకు సైతం ఇళ్లలో లేదా ఆఫీస్ లలో బాంబులు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తులు టెన్షన్ పెట్టారు. ఇప్పటివరకు అలా వచ్చిన కాల్స్ అన్నీ ఫేక్ కాల్స్ గా పోలీసులు గుర్తించారు.

    అయితే పోలీసులు మాత్రం వరుసగా వస్తున్న ఫేక్ కాల్స్ ను సీరియస్ గా తీసుకున్నారు. ఫేక్ కాల్స్ చేస్తున్న వారిపై దృష్టి పెట్టి వారిని గుర్తించే పనిలో పడ్డారు. పోలీసులు ఫేక్ కాల్స్ చేస్తున్న వారిని గుర్తిస్తే వాళ్లు ఎందుకు ఇలా ప్రముఖులను టార్గెట్ చేసి కాల్స్ చేస్తున్నారనే విషయం తెలిసే అవకాశం ఉంది.

    Also Read : రెంటికి చెడ్డ రేవడిలా టాలీవుడ్ దర్శకులు..!