ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్ది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తైంది. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి జగన్ తీసుకున్న పలు నిర్ణయాలకు కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నా ప్రజల్లో మాత్రం మంచి పేరే వస్తోంది. జగన్ సర్కార్ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన దిశగా అడుగులు వేస్తూ ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. తాజాగా జగన్ సర్కార్ అగ్రి గోల్డ్ బాధితులకు శుభవార్త చెప్పింది.
Also Read : తారల చీకటి బాగోతం: డ్రగ్స్ కేసులో వెలుగుచూస్తున్న సెక్స్ రాకెట్?
ఏపీ సీఐడీ ప్రభుత్వం తరపున మాట్లాడుతూ త్వరలోనే అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు చెల్లించనున్నట్టు వెల్లడించింది. ఏపీ హైకోర్టు నుంచి ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నామని.. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందిన వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బు చెల్లిస్తామని పేర్కొంది. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే పది వేల రూపాయలు డిపాజిట్ చేసిన బాధితులకు డబ్బులు చెల్లించింది.
ప్రభుత్వం ప్రస్తుతం 20 వేల రూపాయలు డిపాజిట్ చేసిన వారికి చెల్లించే దిశగా అడుగులు వేస్తోంది. పది వేల రూపాయలు డిపాజిట్ చేసిన వారు గతంలో ఏ కారణాల వల్లైనా ఆ డబ్బును పొందలేకపోతే ఇప్పుడు పొందవచ్చని ఏపీ సీఐడీ ప్రకటన చేసింది. అగ్రి గోల్డ్ బాధితులకు న్యాయం చేయడానికి జగన్ సర్కార్ రెండో విడతలో డబ్బులు చెల్లించడానికి సిద్ధమవుతూ ఉండటంపై అగ్రిగోల్డ్ బాధితుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
టీడీపీ పాలనలో తమకు ఎలాంటి న్యాయం జరగలేదని.. సీఎం జగన్ మాత్రం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటున్నాడని బాధితులు చెబుతున్నారు. అగ్రి గోల్డ్ సంస్థ దేశవ్యాప్తంగా వివిధ పథకాల పేర్లతో 32 లక్షల మంది నుంచి 6,380 కోట్ల రూపాయలు సేకరించింది. అయితే కాలపరిమితి ముగిసినా డబ్బు చెల్లించకపోవడంతో లక్షలాది మంది రోడ్డున పడ్డారు.
Also Read : లాక్డౌన్ నష్టాలను పూడ్చుకుంటున్న రామోజీరావు?