The Lady Killer: 45 కోట్లు పెట్టి తీస్తే 70 వేలు మాత్రమే వచ్చిందా..? మరి ఇంత భారీ డిజాస్టర్ ఏంటి సామి..?

ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న అర్జున్ కపూర్ లాంటి హీరో మాత్రం చేస్తున్న వరుస సినిమాలు ప్లాప్ అవుతున్నాయని బాలీవుడ్ సినీ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

Written By: Gopi, Updated On : June 23, 2024 8:35 am

The Lady Killer

Follow us on

The Lady Killer: బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు భారీ కలెక్షన్లను సాధిస్తాయని వాళ్ళు ప్రతిసారి గొప్పలు చెబుతూ ఉంటారు. అయితే స్టార్ హీరోల సినిమాలు ఒకప్పుడు మంచి వసూళ్లను సాధించేవి. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ల రేంజ్ అనేది భారీగా తగ్గిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే మన తెలుగు సినిమాల డామినేషన్ అనేది ఎక్కువ అయిపోయింది. దానివల్లే అక్కడ వాళ్ల సినిమాల హవా అనేది తగ్గింది.

ఇక మొత్తానికైతే ఒకప్పుడు సూపర్ సక్సెస్ లను సాధించిన బాలీవుడ్ హీరోలు ఇప్పుడు దారుణంగా ఫెయిల్ అవుతున్నారు. ఇక అందులో భాగంగానే మంచి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న అర్జున్ కపూర్ లాంటి హీరో మాత్రం చేస్తున్న వరుస సినిమాలు ప్లాప్ అవుతున్నాయని బాలీవుడ్ సినీ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక అందులో భాగంగానే గత సంవత్సరం ఈయన ‘ది లేడీస్ కిల్లర్’ అనే సినిమా చేశాడు. అయితే మొదటి నుంచి కూడా ఈ సినిమా బడ్జెట్ అనేది భారీగా పెరిగిపోతుంది అంటూ ప్రొడ్యూసర్స్ ఎంత వారించిన వినకుండా అంతకంతకు పెంచుకుంటూ వెళ్లారు.

ఇక మొదట్లో 35 కోట్ల బడ్జెట్ తో తీయాలి అనుకున్న ఈ సినిమా ఫైనల్ గా 45 కోట్లకు చేరింది. ఇక సినిమా ఫ్లాప్ అయిన కూడా ఎంతో కొంత వస్తుందిలే అని మేకర్స్ భావించినప్పటికీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అక్షరాల 70 వేల రూపాయలు మాత్రమే కలెక్షన్లుగా రావడం అనేది ఆ సినిమా మేకర్స్ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీని కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసిందనే చెప్పాలి. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు డిజాస్టర్ అయినా కూడా ఇంత తక్కువ కలెక్షన్స్ అయితే రాలేదు.

ఇక ఈ సినిమా భారీ నష్టాన్ని మిగిల్చడమే కాకుండా అర్జున్ కపూర్ ఇక హీరోగా పనికిరాడు అంటూ బాలీవుడ్ మీడియా చాలా రోజుల నుంచి కోడైకూస్తుంది. అయినప్పటికీ ఎవరు కూడా అవి పట్టించుకోకుండా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన హీరో అని చెప్పి అతనితో ఎగబడి మరి సినిమాలు చేస్తున్నారు. ఫైనల్ గా భారీగా నష్టపోతున్నారు…