Ramayana Budget: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు ఇప్పుడు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. అయితే ఆ సినిమాల్లో కంటెంట్ బాగుండి సినిమా బాగా వస్తే ఆయా సినిమాలు ఈజీగా 1000 కోట్లకు పైన కలెక్షన్లు రాబడుతున్నాయి. కానీ సినిమా స్క్రిప్ట్ లో గాని, మేకింగ్ లో గాని ఏ చిన్న మిస్టేక్ జరిగిన కూడా సినిమా డిజాస్టర్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తే చాలా జాగ్రత్త గా తీస్తే ఎవరికి నష్టం రాకుండా ఉంటుంది.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం రన్బీర్ కపూర్, సాయి పల్లవి లను రాముడు, సీత లుగా పెట్టి ‘రామాయణ ‘ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. కానీ ఈ సినిమాని పేపర్ మీద ఎలాగైతే ఉందో అలా తీయగలిగితేనే ఈ సినిమా అనేది సూపర్ సక్సెస్ అవుతుంది. లేకపోతే మాత్రం గత సంవత్సరం ప్రభాస్ హీరోగా వచ్చిన ఆది పురుషు సినిమా లాగా ఒక డిజాస్టర్ లా మిగిలిపోతుంది. అలాగే చాలా విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ముందుగానే విమర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు…
ఇక ఇప్పటికే ఈ సినిమాకి డైరెక్టర్ అయిన ‘నితీష్ తివారి’ ఈ సినిమాని చాలా జాగ్రత్తగా తెరకెక్కించాలనే ఉద్దేశ్యంతోనే రంగం లోకి దిగినట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాతో తను పౌరాణిక సినిమాలను బాగా డీల్ చేయగలడు అనే ఒక పేరు ను అయితే సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి దానికి అనుకూలంగానే ఇప్పుడు ఆయన ఆ పేరు నిలబెట్టుకుంటాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఈ సినిమాలో రన్బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా కన్నడ స్టార్ హీరో అయిన యశ్ మాత్రం రావణాసురుడి పాత్రను పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఈ సినిమా దాదాపు 850 కోట్లు పెట్టి తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమాని ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీస్తే మాత్రం సినిమా సూపర్ సక్సెస్ అయితే సాధిస్తుంది…