https://oktelugu.com/

Game Changer Vs Raja Saab: గేమ్ చేంజర్ vs రాజాసాబ్ వీటిలో పై చేయి సాధించే సినిమా ఏది..?

శంకర్ డైరెక్షన్ లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా తో భారీ సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమాని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.

Written By: , Updated On : May 14, 2024 / 04:58 PM IST
Game Changer Vs Raja Saab

Game Changer Vs Raja Saab

Follow us on

Game Changer Vs Raja Saab: మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్…ప్రస్తుతం ఈయన గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా తనను తాను మరోసారి ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇంతకు ముందు త్రిబుల్ ఆర్ సినిమాతో ఎలాంటి సక్సెస్ అయితే సాదించాడో ఇప్పుడు కూడా అలాంటి సక్సెస్ ను సాధించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.

ఇక శంకర్ డైరెక్షన్ లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా తో భారీ సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమాని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా తర్వాత మారుతి డైరెక్షన్ లో చేస్తున్న రాజాసాబ్ సినిమాని కూడా రిలీజ్ చేసే పనిలో తను బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు గేమ్ చేంజర్, రాజాసాబ్ రెండు సినిమాలు కూడా ఒకే టైంలో రిలీజ్ అయ్యే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది.

మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుంది అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. నిజానికి శంకర్ లాంటి ఒక స్టార్ డైరెక్టర్ సినిమాకి, మారుతి లాంటి ఒక మీడియం రేంజ్ డైరెక్టర్ తెరకెక్కించే సినిమాకి చాలా వ్యత్యాసం అయితే ఉంటుంది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో కనిపించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

ఇక ప్రభాస్ కూడా రాజాసాబ్ సినిమాలో సరికొత్త క్యారెక్టర్ ని పోషించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే కమర్షియల్ గా సక్సెస్ అవడం కోసం ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్టుగా తెలుస్తుంది. మరి రామ్ చరణ్, ప్రభాస్ ఇద్దరిలో ఎవరు విజయం సాధిస్తారు అనేది కూడా ఇక్కడ కీలకమైన అంశంగా మారింది. చూడాలి మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తుంది అనేది…