Mrunal Thakur: తన ఫేవరేట్ హీరోను చెంపదెబ్బ కొట్టనన్న మృణాల్.. ఏం జరిగిందంటే..?

తెలుగులో నాని శ్రద్ధాల మధ్య వచ్చే ఆ సీను చాలా అద్భుతంగా పండింది. ముఖ్యంగా సినిమా సక్సెస్ లో ఆ సీన్ కీలకపాత్ర వహించిందనే చెప్పాలి.

Written By: Gopi, Updated On : April 26, 2024 10:24 am

Mrunal Thakur

Follow us on

Mrunal Thakur: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు వాళ్లు మొదట స్క్రీన్ మీద నటించేటప్పుడు చాలా ఎగ్జైట్ మెంట్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి సినిమాల్లో నటించాలనే కోరిక అయితే ఉంటుంది. కాబట్టి ఆ కోరికను నెరవేర్చుకునే క్రమంలో కొంత కంగరైతే ఉంటుంది. అయినప్పటికీ స్క్రీన్ మీద వాళ్ళని వాళ్ళు చూసుకునే సమయం కోసం చాలా ఈగర్ గా ఎదురుచూస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ అభిమాన హీరోలతో కలిసి నటించడానికి కూడా ఆయా యాక్టర్స్ చాలా ఉత్సాహం చూపిస్తుంటారు. మొదట వాళ్లతో నటించాలంటే కొంత వరకు భయపడ్డప్పటికీ వాళ్లతో నటించాలి అనే ఒక డ్రీమ్ అయితే వాళ్లలో ఎప్పటికి ఉండిపోతుంది.

కాబట్టి ఆ డ్రీమ్ నెరవేరే సమయంలో కొంచెం తడబాటు ఉండటం కామన్ అనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందుతున్న మృణాళ్ ఠాకూర్ కూడా ఇలాంటి ఒక సిచువేషన్ ని ఎదుర్కొందట. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకి చాలా ఇష్టమని ఈమె మొదటి నుంచి కూడా చెప్పుకొస్తుంది. అయితే ఇదే క్రమంలో సీతా రామం సినిమా హిట్ అయిన తర్వాత ఆమె బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో కలిసి జెర్సీ సినిమాలో నటించింది. ఈ సినిమాలో షాహిద్ కపూర్ ని కొట్టే సీన్ ఒకటి ఉంది. అయితే ఆ సీన్ చేయడానికి తను చాలా ఇబ్బంది పడ్డట్టుగా తను ఒక ఇంటర్వ్యూ లో తెలియజేసింది.

ఇక తెలుగులో నాని శ్రద్ధాల మధ్య వచ్చే ఆ సీను చాలా అద్భుతంగా పండింది. ముఖ్యంగా సినిమా సక్సెస్ లో ఆ సీన్ కీలకపాత్ర వహించిందనే చెప్పాలి. మరి ఈ సినిమాలో ఆ సీన్ ఎలా చేస్తారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. అయితే ఇలాంటి సమయంలోనే మృణాల్ ఠాకూర్ షాహిద్ కపూర్ ను కొట్టలేను అని చెప్పిందట. డైరెక్టర్ మాత్రం వినకుండా కొట్టాల్సిందే అని చెప్పాడట. అయితే తను అప్పుడు నేను స్లోగా కొడతాను మీరు ఎడిటింగ్ లో ఫాస్ట్ చేసుకోండి అని చెప్పిందట. ఇక దర్శకుడు దానికి కూడా వినకుండా మీరు గట్టిగా కొట్టాల్సిందే అని చెప్పడంతో తను కొంత కంగారు పడిందట…

ఇక ఈ సీన్ చేస్తున్న సమయంలో షాహిద్ కపూర్ మీ ఓల్డ్ బాయ్ ఫ్రెండ్ ని ఊహించుకొని నన్ను కొట్టండి అంటూ ఫన్నీగా మాట్లాడాడట. ఆ సీన్ చేయడానికి దాదాపు రెండు నుంచి మూడు గంటల సమయాన్ని తీసుకొని మొత్తానికైతే ఎలాగోలాగా పూర్తి చేసిందట…