https://oktelugu.com/

Rathnam Movie Review: రత్నం మూవీ రివ్యూ…

తమిళంలో మాస్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న హరి దర్శకత్వంలో 'రత్నం 'అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? విశాల్ కి మంచి సక్సెస్ ని తీసుకొచ్చిందా?

Written By:
  • Gopi
  • , Updated On : April 26, 2024 / 10:12 AM IST

    Rathnam Telugu Movie Review

    Follow us on

    Rathnam Movie Review: గత కొన్ని సంవత్సరాల నుంచి హీరో విశాల్ సరైన సక్సెస్ ని కొట్టలేకపోతున్నాడు. ‘ పందెం కోడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరో ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఇక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆ సినిమా తర్వాత సరైన సక్సెస్ అయితే సాధించలేకపోతున్నాడు. అడపాదడప ఒకటి రెండు సక్సెస్ లు వచ్చినప్పటికీ అవి ఆయన కెరియర్ ను డిసైడ్ చేసే సక్సెస్ లు అయితే కాదు. కాబట్టి ఆ సినిమాలు ఆయనకు ఏ రకంగానూ యూజ్ అవ్వలేదు. ఇక ఇలాంటి క్రమంలో తమిళంలో మాస్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న హరి దర్శకత్వంలో ‘రత్నం ‘అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? విశాల్ కి మంచి సక్సెస్ ని తీసుకొచ్చిందా? అలాగే హరి కెరియర్ లో మరొక మంచి మాస్ ఎంటర్టైనర్ గా మిగిలిందా? అనే విషయాలను మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకుందాం…

    కథ

    ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు బార్డర్ లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి రెండు ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకోవాలనుకుంటాయి. ఇలాంటి క్రమంలో లోనే రత్నం (విశాల్) ఎలా ఆ ప్రాబ్లం లోకి ఎంట్రవ్వాల్సి వచ్చింది. అలాగే వాళ్ళు సాల్వ్ చేసే ప్రాబ్లంకి రత్నం లవర్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? హీరోయిన్ కోసం రత్నం వాళ్ళందరి మీద రివెంజ్ తీర్చుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాలో హీరోగా చేసిన విశాల్ అద్భుతమైన నటనను కనబరిచాడు. ఇక మాస్ డైరెక్టర్ అయిన హరి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమర్షియల్ ఎంటర్ టైనర్స్ ను తీయడంలో తనను మించిన దర్శకుడు తమిళ సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరు అనేది మాత్రం వాస్తవం. ఇప్పటికే ఆయన చేసిన యముడు సిరీస్ సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి గుర్తింపు అయితే లభించింది. ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా సినిమా మొత్తం చాలా ఫాస్ట్ గా నడుస్తూ ఉంటుంది. ఈ విషయంలో హరి ఎప్పుడూ సక్సెస్ అవుతూ ఉంటాడు. ఆయన సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ, కనీసం ఒక్కసారైన చూసే విధంగా ఆయన సినిమాలు ఉంటాయి. ఎందుకంటే ప్రతి సీన్ ఆయన చాలా ఎంగేజింగ్ తీసుకెళ్లడం లో చాలా వరకు సక్సెస్ అవుతూ ఉంటాడు. ఇక ఈ సినిమాలో కూడా అదే రిపీట్ చేశాడు.

    ఇక ప్రతి సీన్ ని ప్రేక్షకుడి చేత విజిల్ కొట్టించడం లో తను చాలావరకు సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా విశాల్ చేత కత్తి పట్టించి తన చేత మాస్ సినిమా చేసి చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో కొంత వైలెన్స్ ని ఎక్కువగా వాడినప్పటికీ ప్రతి సీన్ కూడా సిచువేషన్ కి తగ్గట్టుగా క్రియేట్ చేసి ప్రతి ప్రేక్షకుడికి చేత శభాష్ అనిపించుకునేలా ఆ సీన్స్ ను స్క్రీన్ పైన ప్రజెంట్ చేయడంలో హరి చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కూడా చాలా వరకు ప్లస్ అయింది. ఎమోషన్ సీన్స్ లో దేవి ఇచ్చిన బిజిఎం సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళిందనే చెప్పాలి. ఇక కమర్షియల్ సినిమాని చేయడం అనేది చాలా పెద్ద టాస్క్… ఎందుకంటే వారంలో ఒక నాలుగు సినిమాలు రిలీజ్ అయితే అందులో మూడు సినిమాలు కమర్షియల్ సినిమాలే కావడం విశేషం..మిగితా దర్శకులు చేసిన దాని కంటే మనం హీరో ను చాలా కొత్తగా చూపించినప్పుడే సినిమా అనేది సక్సెస్ అవుతుంది.

    కాబట్టి దర్శకుడు హరి కమర్షియల్ ఎంటర్ టైనర్లను తీయడంలో సిద్ధహస్తుడు అనే పేరుని మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక గత కొద్ది రోజుల నుంచి హరికి కూడా సరైన సక్సెస్ లేదు కాబట్టి ఈ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నాడనే చెప్పాలి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. ఆ ఎపిసోడ్ ప్రతి ప్రేక్షకుడి చేత విజిల్స్ కొట్టించేలా ఉండడం అనేది ఈ సినిమా సక్సెస్ లో చాలా కీలకపాత్ర వహించిందనే చెప్పాలి… అయితే ఈ సినిమా స్క్రీన్ మీద ప్రజెంటేషన్ పరంగా చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ కథలో ఇంకొంచెం కాన్ ఫ్లిక్ట్ ని క్రియేట్ చేసి ఉంటే సినిమా అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండేది…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో విశాల్ అద్భుతమైన నటనని కనబరిచాడు. ఇంతకుముందు తను చేసిన సినిమాలు అన్నీ ఒకేత్తు ఇది మరొక ఎత్తు అనేలా ఉండడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి. ఎందుకంటే ఈయన చాలా సంవత్సరాల నుంచి ఫ్లాప్ ని ఎదుర్కొంటూ వస్తున్నాడు. నిజానికి విశాల్ మంచి నటుడు అలాగే హీరో మెటీరియల్ ఉన్న వ్యక్తి కూడా కావడం వల్ల ఈయన స్టార్ హీరో అవుతాడని అందరు అనుకున్నారు. కానీ అతని స్టోరీ సెలక్షన్ లో వచ్చిన ఇబ్బందుల వల్లే తను స్టార్ హీరో అవ్వలేకపోయాడు. అయితే ఈ సినిమాలో తను కనబరిచిన నటన మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. సీన్ కి సీన్ కి మధ్య ఉన్న వేరియేషన్స్ ని చాలా బాగా పట్టుకున్నాడు… ఇక హీరోయిన్ గా చేసిన ప్రియ భవాని శంకర్ కూడా తన పాత్ర పరిధి మేరకు చాలా అద్భుతంగా నటించింది.

    ముఖ్యంగా ఈ సినిమా స్టోరీ తన మీదే ఎక్కువగా నడిచినప్పటికీ తను కూడా ఎక్కడ ఓవరాక్టింగ్ చేయకుండా ఆ సీన్ కి ఎంత అయితే డెప్త్ కావాలో అంత డెప్త్ ని ఇస్తూ తనను తాను ప్రజెంట్ చేసుకోవడంలో చాలా వరకు సక్సెస్ అయ్యింది… ఇక మిగతా ఆర్టిస్టులు అయిన సముద్రఖని, మురళీ శర్మ లాంటి నటులు వాళ్ళ పాత్రల పరిధి మేరకు చాలా అద్భుతంగా నటించారు…

    టెక్నికల్ అంశాలు

    ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ అయితే అద్భుతంగా ఉంది. ఒకటి రెండు సాంగ్స్ వినడానికి బాగున్నాయి. ఇక ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. ఇక దేవి గత కొద్దిరోజుల నుంచి తన ఫామ్ కోల్పోయి చాలా ఇబ్బంది పడుతున్నాడు. కానీ ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి తన ఫామ్ ని అందుకున్నాడనే చెప్పాలి… ఇక సుకుమారన్ అందించిన విజువల్స్ కూడా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యాయి. అసలు సినిమా ఎక్కడా కూడా ఆగకుండా తన విజువల్స్ తో ఫటా ఫట్ గా సినిమాని ముందుకు తీసుకెళ్లాడు. ఈ సినిమాలో ఉండే స్ట్రాంగ్ ఎలిమెంట్స్ ను విజువల్ గా చాలా గ్రాండీయర్ గా చూపించడంలో సినిమాటోగ్రాఫర్ సుకుమారన్ కూడా సక్సెస్ అయ్యాడు. ఇక అలాగే ఈ సినిమా సక్సెస్ లో కూడా తను కీలకపాత్ర వహించాడనే చెప్పాలి. ఇక పీటర్ హెయిన్స్ చేసిన యాక్షన్ కొరియోగ్రాఫీ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంతకుముందు ఆయన చేసిన మిగతా సినిమాలు అన్నింటికంటే కూడా ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా కొత్తగా అండ్ నీట్ గా ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు… ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి…

    ప్లస్ పాయింట్స్

    డైరెక్షన్
    సినిమాటోగ్రఫీ
    కొన్ని ఎమోషన్ సీన్స్

    మైనస్ పాయింట్స్

    వైలెన్స్ కొంచెం ఎక్కువైంది…
    కథలో కాన్ఫ్లిక్ట్ ఇంకొంచెం డెప్త్ గా ఉంటే బాగుండేది…

    రేటింగ్
    ఈ సినిమాకు మేము ఇచ్చే రేటింగ్ 2.5/5

    చివరి లైన్
    యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలను ఇష్టపడే వాళ్లకి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది…