War 2: బాలీవుడ్ గడ్డ మీద తెలుగు వాడి సత్తా చూపిస్తున్న ఎన్టీయార్… మ్యాటరేంటంటే..?

హీరో అంటే ఇలా ఉండాలి అనేంతలా ఎన్టీఆర్ ని పొగడ్తలతో ముంచేస్తున్నారనే సమాచారం అయితే అందుతుంది. ఇక వార్ 2 లో హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరో ఉన్నప్పటికీ ఎన్టీఆర్ మీదనే అటెన్షన్ అయితే ఎక్కువగా ఉంది.

Written By: Gopi, Updated On : May 18, 2024 6:32 pm

War 2

Follow us on

War 2: విశ్వ విఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి మనవడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సినిమాలు చేయడమే కాకుండా తాతకు తగ్గ మనవడిగా కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన పాన్ ఇండియాలో సినిమా చేస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ టాలెంట్ ను గుర్తించిన బాలీవుడ్ ఇండస్ట్రీ సైతం ఆయనని వార్ 2 సినిమాలో హీరోగా తీసుకొని ఆయన చేత ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటింప చేస్తున్నారు.

ఇక తెలుగు వాడు ఎక్కడ ఉన్నా వాడి సత్తా చూపిస్తాడు అనే మాటలకు రూపాన్ని ఇస్తూ ఎన్టీఆర్ ప్రస్తుతం యాక్షన్ ఎపిసోడ్స్ లో చాలా కీలకమైన పాత్రను పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక వార్ 2 లో చేసే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ లో తన కో స్టార్ అయిన హృతిక్ రోషన్ డూప్ ని వాడుతుంటే ఎన్టీఆర్ మాత్రం కొన్ని రిస్కీ షాట్స్ లో కూడా డూప్ లేకుండానే నటించి తెలుగువాడి సత్తా ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఒక షెడ్యూల్లో పాల్గొన్న ఎన్టీఆర్ నటన, యాక్షన్ ఎపిసోడ్స్ లో ఆయన చూపిస్తున్న డెడికేషన్ కి బాలీవుడ్ జనాలందరూ ఫిదా అయిపోయారట.

ఒక హీరో అంటే ఇలా ఉండాలి అనేంతలా ఎన్టీఆర్ ని పొగడ్తలతో ముంచేస్తున్నారనే సమాచారం అయితే అందుతుంది. ఇక వార్ 2 లో హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరో ఉన్నప్పటికీ ఎన్టీఆర్ మీదనే అటెన్షన్ అయితే ఎక్కువగా ఉంది. వార్ 2 సినిమా అనగానే మనకు ఎన్టీఆర్ మాత్రమే గుర్తొస్తున్నాడంటే ఎన్టీఆర్ ఈ సినిమా మీద ఎలాంటి డెడికేషన్ తో వర్క్ చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది.

అయితే ఈ సినిమాతో మాత్రం ఎన్టీఆర్ కి భారీగా పేరు వస్తుందని బాలీవుడ్ జనాలు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇప్పటికే ఎన్టీయార్ సెట్ లో సింగిల్ టేక్ లో డైలాగ్ లు చెప్పడం చూసిన అక్కడి జనాలందరూ ఆయన నటనకి ఫిదా అయిపోయారట.. చూడాలి మరి ఎన్టీఆర్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంటాడు అనేది…