https://oktelugu.com/

Bollywood: ఈ ముగ్గురు బాలీవుడ్ హీరోలు సినిమా చేస్తే అది ఇండస్ట్రీ హిట్ అవుతుందా..?

రన్బీర్ కపూర్ గత సంవత్సరం అనిమల్ సినిమా చేసి సూపర్ సక్సెస్ అందుకున్నప్పటికీ ఆ సినిమా తీసిన సందీప్ వంగ సౌత్ సినిమా డైరెక్టర్ అందులోను తెలుగు సినిమా డైరెక్టర్ అవ్వడం విశేషము.

Written By:
  • Neelambaram
  • , Updated On : June 6, 2024 / 06:03 PM IST

    Bollywood

    Follow us on

    Bollywood: ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఒక్క సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇంతకు ముందు అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన ‘దంగల్ ‘ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 1900 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ సినిమా తర్వాత నుంచి బాలీవుడ్ లో ఆ రేంజ్ హిట్ అందుకున్న సినిమా అయితే మరొకటి రాలేదు. మరి ఇలాంటి క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ చాలా అయోమయానికి గురవుతున్నారు.

    ఎందుకంటే ఇంతకు ముందు వాళ్ళు చేసిన సినిమాలు ఈజీగా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసేవి.. కానీ ఇప్పుడు వాళ్లు చేస్తున్న సినిమాలు ప్రేక్షకుల్ని అలరించకపోగా, సౌత్ సినిమాలా తాకిడి తట్టుకొని నిలబడే శక్తి బాలీవుడ్ హీరోలకు లేకుండా పోయింది. అందువల్లే వాళ్ళు మల్టీస్టారర్ సినిమాలు చేసైన సరే రికార్డుని బ్రేక్ చేసి తను ఒక కొత్త రికార్డు ని క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఇక అందులో భాగంగానే ప్రస్తుతం అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, రన్బీర్ కపూర్ ముగ్గురు కలిసి ఒక పెద్ద సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకప్పుడు బాలీవుడ్ అంటే ఇండియాలోనే టాప్ ఇండస్ట్రీ గా గుర్తింపు పొండింది.

    కానీ ఇప్పుడు వాళ్ళ ఉనికిని వాళ్ళు కాపాడుకోవడం కూడా చాలా కష్టంగా మారింది. ఇక రన్బీర్ కపూర్ గత సంవత్సరం అనిమల్ సినిమా చేసి సూపర్ సక్సెస్ అందుకున్నప్పటికీ ఆ సినిమా తీసిన సందీప్ వంగ సౌత్ సినిమా డైరెక్టర్ అందులోను తెలుగు సినిమా డైరెక్టర్ అవ్వడం విశేషము.ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకొని 900 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టాడు… సందీప్ కూడా సౌత్ సినిమా ఇండస్ట్రీకి చెందిన వాడు కావడం వల్ల సౌత్ వాళ్ళు లేకుండా మనం ఏం చేయలేమా అనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో బాలీవుడ్ హీరోలు ఉన్నట్టుగా తెలుస్తుంది.

    ఇక వాళ్లు మల్టీస్టారర్ సినిమా చేసి సినిమా రికార్డులను బ్రేక్ చేయాలని చాలా వరకు కసరత్తులు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక అందులో భాగంగానే షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, రన్బీర్ కపూర్ ముగ్గురు కలిసి సినిమా చేద్దాం అని ఫిక్స్ అయ్యారు. ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేసే డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఆయన ఈ సినిమాను సరిగ్గా హ్యాండిల్ చేయగలడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. చూడాలి మరి ఫ్యూచర్ లో బాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంటుందో…