Anurag Kashyap: బాలీవుడ్లో అట్టర్ ఫ్లాప్ అయిన డైరెక్టర్ కు ఇప్పుడు ఫుల్ డిమాండ్.. కానీ ట్విస్ట్ ఇదే…

రీసెంట్ గా విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో చేసిన 'మహారాజా ' సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. నిజానికి విజయ్ సేతుపతి చేసిన క్యారెక్టర్ కి ఎంత మంచి గుర్తింపు వచ్చిందో అనురాగ్ కశ్యప్ పోషించిన పాత్ర కి కూడా అంతే మంచి పేరు అయితే వచ్చింది. ఇక మీదట తను కూడా యాక్టర్ గా కొనసాగాలి అనుకుంటే ఇదే రీతిలో మంచి క్యారెక్టర్లను ఎంచుకుంటూ ముందుకు సాగాలి.

Written By: Gopi, Updated On : July 18, 2024 11:37 am

Anurag Kashyap

Follow us on

Anurag Kashyap: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో అనురాగ్ కశ్యప్ ఒకరు. ఈయన ఒకప్పుడు బ్లాక్ ఫ్రైడే, దేవ్ డి, గ్యాంగ్స్ ఆఫ్ వసిపూర్, అగ్లీ లాంటి సూపర్ డూపర్ సక్సెస్ ఫుల్ సినిమాలను తెరకెక్కించాడు… అయితే గత కొద్ది రోజుల నుంచి ఆయన చేస్తున్న సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. ఇక దాని కోసమే ఆయన యాక్టింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బాలీవుడ్ సినిమాల్లో అడపదడప క్యారెక్టర్లు పోషించినప్పటికీ వాటి ద్వారా ఆయనకు పెద్దగా గుర్తింపు అయితే రాలేదు.

కానీ రీసెంట్ గా విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో చేసిన ‘మహారాజా ‘ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. నిజానికి విజయ్ సేతుపతి చేసిన క్యారెక్టర్ కి ఎంత మంచి గుర్తింపు వచ్చిందో అనురాగ్ కశ్యప్ పోషించిన పాత్ర కి కూడా అంతే మంచి పేరు అయితే వచ్చింది. ఇక మీదట తను కూడా యాక్టర్ గా కొనసాగాలి అనుకుంటే ఇదే రీతిలో మంచి క్యారెక్టర్లను ఎంచుకుంటూ ముందుకు సాగాలి. ఇక నటన పరంగా కూడా ఆయన కొంతవరకు మెళుకువలను నేర్చుకుంటూ ముందుకు సాగితే మాత్రం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఆయన కూడా చాలా ఇంపార్టెంట్ యాక్టర్ గా గుర్తింపు పొందుతాడు…

అయితే ఆయన లాంటి ఒక దర్శకుడు యాక్టర్ గా మారడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఆయన చేసిన సినిమాలు సూపర్ హిట్ గా నిలిచినప్పటికీ మధ్యలో కొన్ని ప్లాప్స్ రావడంతో ఆయన నటన మీద ఆసక్తి అయితే చూపిస్తున్నాడు. మరి మొత్తానికైతే అనురాగ్ కశ్యప్ కోసం ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు కూడా మంచి క్యారెక్టర్లను రాస్తున్నారనే టాక్ అయితే వినిపిస్తుంది. నిజానికి బాలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ ఇండస్ట్రీలో కూడా ఆయన మీద కొన్ని క్యారెక్టర్లు రాసేంత గొప్పగా ‘ మహారాజా ‘ సినిమాలో ఆయన తన పాత్ర ను పోషించాడు. ఇక ఆ క్యారెక్టర్ ని చూసిన ప్రతి ఒక్క ఆడియన్ కూడా మెస్మరైజ్ అయిపోయారనే చెప్పాలి. ఇక ఆ పాత్రలో ఆయన తప్ప మరొకరు నటించలేరు అనేంతలా జీవించేసాడు.

ఇక మొత్తానికైతే అనురాగ్ కశ్యప్ రూపంలో ఇండస్ట్రీకి మరొక మంచి నటుడు దొరికాడు అంటూ సినీ విమర్శకులు సైతం ఆయన మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక తను అనుకున్నట్టుగానే ఫుల్ టైమ్ యాక్టర్ గా కొనసాగుతాడా లేదా మళ్లీ డైరెక్షన్ వైపు వెళ్తాడా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఇప్పటికే ఎస్ జె సూర్య, సముద్ర ఖని లాంటి డైరెక్టర్లు నటులుగా మారి అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇస్తున్నారు. మిగితా ఆర్టిస్ట్ లకు సాధ్యం కాని రీతిలో నటించి నేషనల్ అవార్డ్స్ ను కూడా సొంతం చేసుకుంటున్నారు.

మరి వాళ్ళ లాగానే తను కూడా మంచి పాత్రలను చేసి నటుడిగా మంచి గుర్తింపు సాధించుకుంటాడో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఈయన కనక నటుడుగా ఇండస్ట్రీ లో క్లిక్ అయితే మాత్రం మరికొంత మంది దర్శకులు నటులు మారి యాక్టింగ్ బాట పట్టే అవకాశలైతే ఉన్నాయి. ఇక ఇప్పటికే కొంతమంది ప్లాప్ డైరెక్టర్లు నటులు గా మారే ప్రయత్నం చేస్తున్నారు…