Bollywood Stars
Bollywood Stars: పట్టణంలో ఇల్లు ఉండాలి కానీ లక్షల్లో సంపాదించవచ్చు. కానీ సిటీ లో ఇల్లు ఉండాలి అంటే మామూలు విషయం కాదు కదా. ఉద్యోగాలు చేస్తే రూ. 30వేలు సంపాదిస్తారు కావచ్చు కానీ రెండు లేదా మూడు ఫ్లోర్ల బిల్డింగ్ ఉంటే లక్ష రూపాయలు సులభంగా సంపాదించవచ్చు. మరి ఈ సంపాదనను కూడా వదలరు సెలబ్రెటీలు. అవునండోయ్ సినిమాలు, యాడ్స్, వ్యాపారాలు, ఇంటి అద్దెలు అంటూ తెగ సంపాదించేస్తున్నారు మన సూపర్ హీరోలు, హీరోయిన్ లు. అందులో మరీ ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలు తమ లగ్జరీ ఫ్లాట్లను అద్దెకు ఇచ్చి లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. ఇంతకీ వారు ఎవరు అంటే..
బాలీవుడ్ సీనియర్ నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నుంచి సల్మాన్ ఖాన్ వరకు చాలామంది స్టార్స్ తమ ఇళ్లను రెంట్ కు ఇస్తూ తెగ సంపాదించేస్తున్నారు. ఈ లిస్ట్ లో అందరికంటే ఎక్కువగా సంపాదిస్తుంది అమితాబ్ బచ్చన్ అని టాక్. సైఫ్ అలీ ఖాన్ కు ముంబైలోని బాంద్రాలో అపార్ట్మెంట్ ఉందట. ఇక ఈయన దీన్ని అద్దెకు ఇచ్చారని దీనికి ఏకంగా నెలకు రూ. 3.5 లక్షలు సంపాదిస్తున్నారు అని తెలుస్తోంది. మరో విషయం ఏంటంటే ఈ సారి అద్దె కూడా పెంచేశారట ఈ స్టార్
బాలీవుడ్ బిగ్ బీ కు కూడా చాలా ఇల్లులు ఉన్నాయి. వాటిలో ఒకటి డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్. ఇందులో ఉంటుంది ఎవరో కాదు కృతి సనన్. అమితాబ్ కు ఆమె ప్రతి నెలా దాదాపు 10 లక్షల రూపాయల అద్దె ఇస్తుందట. రణబీర్ కపూర్ కు ముంబై, పూణెలో ఆస్తులు చాలా ఉన్నాయి అని టాక్. పూణెలోని ట్రంప్ టవర్‌లో ఉన్న ఫ్లాట్ ను ఇప్పటికే ఆయన అద్దెకు ఇచ్చారు అని తెలుస్తోంది. ఈ ఫ్లాట్ నుంచి నెలకు అద్దె దాదాపు 4 లక్షల రూపాయలు వస్తుంది అని టాక్. సల్మాన్ ఖాన్ కు కూడా బాంద్రాలోని ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఉందట. మరి దీని ద్వారా సల్మాన్ ఖాన్ ఎంత సంపాదిస్తున్నారో తెలుసా? ఏకంగా నెలకు దాదాపు 1.5 లక్షలు వస్తుందట. ఈ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుంటే అడ్వాన్స్ గా రూ.4 నుంచి 5 లక్షలు ముందుగానే చెల్లించాలి.
హీరోలే కాదు హీరోయిన్ లు కూడా అద్దె ద్వారా బాగానే సంపాదిస్తున్నారు. అందులో ముఖ్యంగా ప్రియాంక చోప్రా కూడా ముంబైలో ఇల్లు కొని అద్దెకు ఇచ్చింది. ఈమెకు ముంబైలో చాలా ఆస్తులు ఉన్నాయి. పూణే సమీపంలో ఆమెకు ఒక విలాసవంతమైన బంగ్లా ఉందని తెలుస్తోంది. ఈ బంగ్లాను అద్దెకు ఇచ్చి ఆమె నెలకు రూ. 2 లక్షల వరకు సంపాదిస్తుందట. మలైకా అరోరా బాంద్రాలోని తన విలాసవంతమైన ఇంటిని ఇటీవల అద్దెకు ఇచ్చింది అని తెలుస్తోంది. తన అపార్ట్‌మెంట్‌ను కాస్ట్యూమ్ డిజైనర్ కాశీష్ హన్స్‌కు మూడేళ్లపాటు అద్దెకు ఇచ్చిందట మలైకా. దీని నుంచి మలైకాకు ప్రతి నెల అద్దె రూ.1.57 లక్షలు అందుతోంది. మరి చూశారు కదా సంపాదించాలి అనుకుంటే చాలా దారులు ఉన్నాయి అని మన స్టార్లు ఏ విధంగా ప్రూఫ్ చేస్తున్నారో.. మీరు కూడా ఏదైనా సోర్స్ ఆలోచించండి..