Ram Mohan Naidu: రెండు సార్లు ప్రధాని అయిన నరేంద్ర మోడీ మూడవసారి కూడా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలోనే కొత్త మంత్రివర్గం కూడా ఏర్పడింది. అయితే రామ్మోహన్ నాయుడు క్యాబినెట్ మంత్రిగా ఎంపిక అయిన విషయం తెలిసిందే . ఈయన శ్రీకాకుళం ఎంపీ. ఇక్కడ నుంచి పోటీ చేసి మూడోసారి ఎంపీగా నిలిచారు. ఈయన ఎవరో కాదు కేంద్ర మాజీ మంత్రి, దివంగత ఎర్రన్నాయుడు కొడుకు. కింజరాపు ఎర్రన్నాయుడు గారు 2012 లో తుది శ్వాస విడిచారు. ఆ సందర్భంలోనే రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు. 2014 లో, 2019 లో, పాటు 2024 లో కూడా శ్రీకాకుళం నుంచి పోటి చేసి ఎంపీగా గెలిచారు.
మొదటి సారి ఎంపీగా నిలిచినప్పుడు ఈయన వయసు 26 సంవత్సరాలు మాత్రమే. పది సంవత్సరాలలో ఇప్పుడు అంటే 36 సంవత్సరాలలో కేంద్ర మంత్రిగా ఎన్నికయ్యారు. అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రి అయిన మొదటి వ్యక్తిగా రామ్మోహన్ నాయుడు ఘనత పొందారు. అయితే ఈయన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో పుట్టి.. బీటెక్, ఎంబీఏ చదువుకున్నారు.
2017 లో తెలుగుదేశం పార్టీ సీనియర్ అయిన బండారు సత్యనారాయణమూర్తి చిన్న కూతురు శ్రావ్యని పెళ్లి చేసుకున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే రామ్మోహన్ నాయుడు సోదరి ఆదిరెడ్డి భవాని కూడా 2019 లో రాజమండ్రిలో అర్బన్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.అయితే ఈయన బాబాయ్ కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేసి గెలిచారు. అంతేకాదు ఈయన తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు పదవిలో కూడా ఉన్నారు.
ఇదిలా ఉంటే రామ్మోహన్ నాయుడు లోక్‌సభలో కన్సల్టేటివ్ కమిటీ, హోమ్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ, అధికార భాష, వెకబడిన వర్గాల సంక్షేమ కమిటీలలో సభ్యుడిగా పని చేస్తున్నారు. యువతలో రామ్మోహన్ నాయుడుకి చాలా మంది అభిమానులు ఉంటారనేది కాదనలేని వాస్తవం. పార్లమెంట్ చర్చా వేదికల్లో ఈయన స్పీచ్ లు చాలా ఫేమస్ అయ్యాయి. ఈ స్పీచ్ లో ఎన్నో ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. తెలుగుతో పాటు, హిందీ, ఇంగ్లీష్ లో కూడా రామ్మోహన్ నాయుడు అనర్గళంగా మాట్లాడే శక్తి ఆయనకు ఉంది. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద ఘనతని సాధించిన వ్యక్తిగా గుర్తింపు సంపాదించడం మాత్రమే కాదు యూత్ ఇన్స్పిరేషన్ కూడా.