Bollywood: త్వరలోనే పెళ్లి పీఠలెక్కనున్న మరో బాలీవుడ్ జంట… ఎవరంటే ?

Bollywood: బాలీవుడ్ లో ప్రేమ జంటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. కానీ చివరికి ఆ జంట కొన్ని సమస్యల వల్ల విడిపోతున్నట్లు ప్రకటిస్తారు. అలా బాలీవుడ్ లో చాలా జంటలు చేశాయి. మాధురి దీక్షిత్ – సంజయ్ దత్​, దీపికా – రణబీర్, షాహిద్ – కరీనా, తదితర జంటలు ఇలానే చేశాయి. కానీ ఇటీవల కాలంలో బాలీవుడ్ నటి నటులు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇన్నాళ్లు రిలేష‌న్‌షిప్‌లో ఉండి ఒక్కొక్కరిగా పెళ్లి […]

Written By: Raghava Rao Gara, Updated On : November 20, 2021 8:27 pm
Follow us on

Bollywood: బాలీవుడ్ లో ప్రేమ జంటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. కానీ చివరికి ఆ జంట కొన్ని సమస్యల వల్ల విడిపోతున్నట్లు ప్రకటిస్తారు. అలా బాలీవుడ్ లో చాలా జంటలు చేశాయి. మాధురి దీక్షిత్ – సంజయ్ దత్​, దీపికా – రణబీర్, షాహిద్ – కరీనా, తదితర జంటలు ఇలానే చేశాయి. కానీ ఇటీవల కాలంలో బాలీవుడ్ నటి నటులు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇన్నాళ్లు రిలేష‌న్‌షిప్‌లో ఉండి ఒక్కొక్కరిగా పెళ్లి వైపు దారి తీస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ న‌టుడు రాజ్‌కుమార్ రావు, ప‌త్ర‌లేఖలు వివాహం చేసుకున్నారు. త్వరలో విక్కీ కౌశ‌ల్‌, క‌త్రినా కైఫ్ కూడా పెళ్లి పీట‌లెక్క‌బోతున్నారు. ఇంకో వైపు స్టార్ యాక్టర్స్ ర‌ణ్‌బీర్ క‌పూర్‌, అలియా భ‌ట్ కూడా త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్కేందుకు రెడీ అవుతున్నారు.

తాజాగా మ‌రో బాలీవుడ్ తార తన రిలేష‌న్‌షిప్‌ని వివాహ బంధంగా మార్చబోతుంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2, మ‌ర్ జవాన్ చిత్రాల‌తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన హీరోయిన్ తారా సుటారియా. తాజాగా తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెప్తుంది. ఇంత‌కీ ఈ హీరోయిన్ పెళ్లి చేసుకునేది ఎవర్నో తెలుసుకోవాలి అనుకుంటున్నారా. బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్ బీర్ క‌పూర్ కజిన్ యాక్ట‌ర్ ఆదార్ జైన్ తో ఏడు అడుగులు వేసేందుకు రెడీ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.  ఆలియా- ర‌ణ్ బీర్ పెళ్లి కంటే ముందు వీరిద్ద‌రూ పెళ్లి బంధంతో ఒక్కటవ్వబోతున్నారు అని సమాచారం. ప్రస్తుతం ఏ ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.