Homeఎంటర్టైన్మెంట్Bollywood Trends:  అక్షయ్ తో విభేదాల్లేవ్.. ముద్దులడిగారు అందుకే వద్దు అన్నా ! 

Bollywood Trends:  అక్షయ్ తో విభేదాల్లేవ్.. ముద్దులడిగారు అందుకే వద్దు అన్నా ! 

Bollywood Trends:  బాలీవుడ్ ట్రెండ్స్   నుంచి  ప్రజెంట్   క్రేజీ  అప్ డేట్స్  విషయానికి వస్తే..  తనకు, అక్షయ్ కుమార్‌కి మధ్య విభేదాలు తొలగిపోయాయని ప్రముఖ కమెడియన్, యాంకర్ కపిల్ శర్మ అన్నాడు. ‘అక్షయ్‌కు, నాకు మధ్య విభేదాలు వచ్చాయంటూ మీడియాలో వస్తోన్న వార్తలు చూశా. ఇప్పుడే నేను అక్షయ్‌తో మాట్లాడాను. సమాచార లోపంతోనే మా మధ్య అపార్థాలు తలెత్తాయి. నేను ఫోన్‌ చేసి మాట్లాడటంతో ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయి. అక్షయ్‌ నాకు ఎప్పటికీ పెద్దన్న లాంటివారు. ఆయనకు నాపై ఎలాంటి కోపం లేదు’ అని కపిల్ అన్నాడు.
Kapil Sharma
Kapil Sharma
ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. తనకు 2011లో యశ్ రాజ్ ఫిలింస్‌లో హీరోయిన్‌గా నటించమని ఆఫర్ వచ్చిందని, దానిని తాను తిరస్కరించానని నటి అమృతా రావు వెల్లడించింది. సినిమాలో ముద్దు సన్నివేశాలతో పాటు ఇంటిమేట్ సీన్స్ ఉంటాయని, అవి చేయడానికి సిద్ధంగా ఉన్నారా..? అని చిత్ర నిర్మాత ఆదిత్య చోప్రా తనను అడిగారని అమృత చెప్పింది. అయితే.. ఆ పాత్రకు తాను న్యాయం చేయలేనని చెప్పి ఆ ఛాన్స్ వదులుకున్నానని గుర్తు చేసుకుంది.

Also Read:  ఏపీలో ఏప్రిల్ 8 నుంచి ఇంట‌ర్, మే 2 నుంచి ప‌ది ప‌రీక్ష‌లు ప్రారంభం

amrita rao
amrita rao
మరో అప్ డేట్ విషయానికి వస్తే..  ప్రధాని మోదీపై ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్.ఖాన్ ప్రశ్నల వర్షం కురిపించాడు. ‘13ఏళ్లు సీఎంగా ఉన్న మోదీ ఇప్పుడు 7ఏళ్లుగా పీఎం గా ఉంటున్నారు. నేడు దేశంలో ఉన్న పరిస్థితులకు కాంగ్రెస్‌దే బాధ్యత అని అంటున్నారు. సార్.. మీరు దేనికి బాధ్యులు దయచేసి చెప్పగలరా..? 100 స్మార్ట్ సిటీల వంటి ఫేక్ ప్రామిస్‌లు చేయడం తప్ప గత 7ఏళ్లలో మీరు ఏమి చేశారో దయచేసి మాకు చెప్పగలరా..?’ అని ట్విటర్ వేదికగా ప్రశ్నించాడు.
Kamaal_Rashid_Khan
Kamaal_Rashid_Khan
ఇక మరో అప్ డేట్ ఏమిటంటే..  హీరోయిన్ డింపుల్ హయాతి మీడియాతో పంచుకుంది.  ‘లంగా ఓణీతో పక్కింటి అమ్మాయిని గుర్తు చేస్తా. అదే క్రమంలో ట్రెండీ అమ్మాయిగాను కనిపిస్తా. ఖిలాడీ చిత్రంలో ‘క్యాచ్‌ మీ’ సాంగ్ చేయడానికి ముందు కొంచెం బొద్దుగా ఉన్నా. దర్శకుడి సలహాతో 6కిలోలు బరువు తగ్గాను. మూవీలో యాక్షన్ సన్నివేశాల్లో తప్ప సినిమా మొత్తం కనిపిస్తాను’ అని పేర్కొంది.
Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

2 COMMENTS

  1. […] Shruti Haasan: నటసింహం బాలయ్య – షార్ప్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రాబోతున్న ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. అయితే.. తాజాగా శృతి హాసన్ ఈ సినిమా టీమ్ ను ఇబ్బంది పెడుతునట్లు తెలుస్తోంది. అవసరం అయినప్పుడు డేట్లు ఇవ్వకుండా.. అలాగే ఎప్పుడు డేట్లు ఇస్తోందో కూడా చెప్పకుండా మొత్తానికి టార్చర్ చూపిస్తోందట. నిజానికి ఈ సినిమా కోసం లావు కూడా పెరగడానికి ఒప్పుకుంది శృతి హాసన్. […]

  2. […] CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో చిరంజీవి, మహేశ్ బాబు, కొరటాల శివ, నిర్మాత నిరంజన్ రెడ్డితో భేటీ అయి.. సినిమా టికెట్ల ధరల పెంపు పై చర్చించారు. కాగా ఈ భేటీకి సంబంధించి జగన్ మాట్లాడుతూ.. అన్నీ విషయాల పై క్లారిటీ ఇచ్చారు. హీరో, హీరోయిన్, డైరెక్టర్ పారితోషికాలతో సంబంధం లేకుండా సినిమా బడ్జెట్ పెరిగిపోతోందని సీఎం జగన్ చెప్పారు. ‘ఇప్పటివరకు కొద్దిమందికి ఎక్కువ, కొందరికి తక్కువ టికెట్ రేట్లు వసూలు చేస్తున్నారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular