https://oktelugu.com/

‘సర్కారు వారి పాట’లో బాలీవుడ్‌ స్టార్స్‌

టాలీవుడ్‌ సూపర్‌‌స్టార్‌‌ మహేష్‌ బాబు వరుస హిట్లతో ‘దూకుడు’ మీద ఉన్నాడు. ఎప్పటికప్పుడు తన బాడీ స్టైల్‌తోపాటు డ్యాన్స్‌తోనూ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మహేష్‌ వేసిన స్టెప్పులు అభిమానులతో విజిల్స్‌ వేయించాయి. ప్రతీ సినిమాలోనూ ప్రత్యేకతను చాటే మహేష్‌.. విలన్స్‌, కమెడీయన్స్‌ విషయంలోనూ విభిన్నంగా సెలక్ట్‌ చేసుకుంటుంటారు. అప్పుడప్పుడు బాలీవుడ్‌ నటులనూ తీసుకొస్తుంటారు. Also Read: భారీ ప్లాప్ డైరెక్టర్ కి మెగాస్టార్ ఛాన్స్.. కారణం ? మొన్నటి వరకు లాక్‌డౌన్‌తో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. […]

Written By:
  • NARESH
  • , Updated On : September 16, 2020 / 10:59 AM IST
    Follow us on


    టాలీవుడ్‌ సూపర్‌‌స్టార్‌‌ మహేష్‌ బాబు వరుస హిట్లతో ‘దూకుడు’ మీద ఉన్నాడు. ఎప్పటికప్పుడు తన బాడీ స్టైల్‌తోపాటు డ్యాన్స్‌తోనూ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మహేష్‌ వేసిన స్టెప్పులు అభిమానులతో విజిల్స్‌ వేయించాయి. ప్రతీ సినిమాలోనూ ప్రత్యేకతను చాటే మహేష్‌.. విలన్స్‌, కమెడీయన్స్‌ విషయంలోనూ విభిన్నంగా సెలక్ట్‌ చేసుకుంటుంటారు. అప్పుడప్పుడు బాలీవుడ్‌ నటులనూ తీసుకొస్తుంటారు.

    Also Read: భారీ ప్లాప్ డైరెక్టర్ కి మెగాస్టార్ ఛాన్స్.. కారణం ?

    మొన్నటి వరకు లాక్‌డౌన్‌తో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తాజాగా అన్‌లాక్‌లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా షూటింగ్‌లకూ పర్మిషన్‌ ఇచ్చాయి. దీంతో ఒక్కో సినిమా సెట్స్‌పైకి వెళ్తున్నాయి. ఇందులో భాగంగా సూపర్‌‌ స్టార్‌‌ మహేష్‌ లేటెస్ట్‌ మూవీ ‘సర్కారు వారి పాట’ మొదటి షెడ్యూల్‌ త్వరలోనే అమెరికాలో ప్రారంభం అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

    ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే.. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్స్‌ హంగామా పెరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో అనీల్‌ కపూర్‌ విలన్‌గా నటిస్తారని వార్తలు వినిపించాయి. లేటెస్ట్‌ సినీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్‌ కూడా నటించనున్నారట. ఆమే విద్యాబాలన్. ప్రస్తుతం యూనిట్‌ విద్యాబాలన్‌తో చర్చలు జరుపుతోందట. ఆమె ఓకే అంటే.. మహేష్‌ సోదరి పాత్రలో విద్యాబాలన్‌ కనిపించనున్నారని టాక్‌ వినిపిస్తోంది.

    Also Read: Bigg Boss 4.. అమెరికా అల్లుడిపై అత్త మోజు..!

    ఇది వరకు విద్యాబాలన్‌ తెలుగులో ‘యన్‌.టి.ఆర్’ చిత్రంలో బసవతారకమ్మ పాత్రలో నటించారు. ఇప్పుడు మహేష్‌ సినిమాలో నటించడానికి ఓకే చెబితే ఆమె టాలీవుడ్‌లో చేసే రెండో సినిమా అవుతుంది.