Srikanth: ‘అఖండ’లో విలన్ గా ప్రేక్షకులను మెప్పించిన హీరో శ్రీకాంత్ కూడా ఈ రోజు కోవిడ్-19 బారిన పడ్డారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ. “ప్రియమైన స్నేహితులారా, కారోనాకి సంబంధించి నేను అవసరమైన అన్నీ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు కూడా తాజాగా COVID-19 పాజిటివ్ వచ్చింది. గత రెండు రోజుల నుంచి నాలో కరోనా లక్షణాలు ఉన్నాయి’ అం శ్రీకాంత్ తెలిపాడు.

ఇక గత నాలుగు రోజులుగా తనను కలిసిన వారు కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని శ్రీకాంత్ కోరాడు. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం స్వీయనిర్బంధంలో ఉంటూ చాలా జాగ్రత్తగా తన ఆరోగ్యం పై పూర్తి శ్రద్ధ పెట్టాడట శ్రీకాంత్. పనిలో పనిగా ఈ హీరో ఒక చిన్న సలహా కూడా ఇచ్చాడు.
Also Read: ధమాకా నుంచి అల్ట్రా-స్టైలిష్ లుక్ లో రవితేజ
అందరూ మాస్కులు ధరించండి. అత్యవసరమైతే తప్ప అనవసరంగా బయట తిరగకండి. అందరూ జాగ్రత్తగా ఉండండి’ అంటూ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా ఈ కరోనా మాత్రం ఎవర్నీ వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే మహేష్ బాబు,, మంచు మనోజ్, లక్ష్మి ప్రసన్న, శోభన ఇలా అందరూ కరోనా బారిన పడి కోలుకున్నారు.

ప్రస్తుతం కరోనా కారణంగా మెగాస్టార్ చిరంజీవి, రాజేంద్రప్రసాద్, బండ్ల గణేష్, నేడు శ్రీకాంత్ కరోనాతో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కరోనా మూడో వేవ్ కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. కాగా కరోనా మైల్డ్ లక్షణాలున్న వారు ఎలాంటి ఇబ్బంది పడకుండానే కోలుకుంటున్నారు. త్రిష, సత్యరాజ్, థమన్ కోవిడ్ నుంచి చాలా వేగంగా కోలుకున్నారు.
Also Read: 1980 స్ లో స్టార్ హీరోల రెమ్యూనరేషన్స్ లిస్ట్.. ఎవరికి ఎక్కువ అంటే ?