Bollywood Star Hero : ఈ స్టార్ నటులు ఒకప్పుడు ఆర్థిక సమస్యలతో లేదా ఇతర కారణాలతో 10 లేదా ఇంటర్ చదువుతో ఆపేసిన వాళ్లే. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న ఈ స్టార్ హీరో కూడా ఈ జాబితాకు చెందిన వాడే. ఇప్పుడున్న రోజులలో ప్రతి ఒక్కరికి చదువుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ కొన్నేళ్ల క్రితం ఇప్పుడున్న దానికి పరిస్థితులు చాలా భిన్నంగా ఉండేవి. వాళ్లు మంచి చదువులు చదువుకోవడానికి కుటుంబ పరిస్థితులు కూడా సహకరించేవి కాదు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే స్టార్ హీరో పరిస్థితి కూడా అప్పట్లో ఇంతే. చదువులో పూర్ గా ఉన్న ఇతను తనకు చాలా ఇష్టమైన నటన రంగంలో తన కెరీర్ను వెతుక్కోవాలి అనుకున్నాడు. కానీ ప్రారంభంలో అక్కడ కూడా అతనికి చాలా నిరాశ ఎదురయింది. ఎన్నోపమనాలను ఎదుర్కొన్నాడు. కానీ ఇతను ఊహించని ఒక ఘటనతో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కెరియర్ ప్రారంభంలో కూడా ఎన్నో అడ్డంకులు, అవమానాలను ఎదుర్కొని స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలలో ఇతను కూడా ఒకరు. ఇప్పటివరకు ఈ స్టార్ హీరో ఖాతాలో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి. తన నటనతో ఇతను ఎన్నో పురస్కారాలను అలాగే విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు.
Also Read : RRR చిత్రం పై పీఎం నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం..వీడియో వైరల్!
ప్రస్తుతం ఒక్కో సినిమాకు 100 కోట్ల పారితోషకం అందుకుంటున్నాడు. సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న స్టార్ హీరోలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ స్టార్ హీరో ఆస్తి ప్రస్తుతం రూ.1800 కోట్లు పైగానే ఉందని సమాచారం. ఈ మధ్యకాలంలో ఈ స్టార్ హీరో సినిమాల కంటే కూడా రిలేషన్షిప్ విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉన్నాడు. ఇప్పటికీ స్టార్ హీరో ఇద్దరిని పెళ్లి చేసుకుని ఇద్దరికీ కూడా విడాకులు ఇచ్చాడు. ప్రస్తుతం మూడో పెళ్లి కూడా చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఒక కొత్త మహిళతో ఎక్కువగా కనిపిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు.
ఈ హీరో మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్. అమీర్ ఖాన్ గురించి బాలీవుడ్ సినిమా ప్రేక్షకులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమీర్ ఖాన్ చిన్నతనంలో చదువులో చాలా పూర్. స్కూల్ చదువుతున్న సమయంలో ఏదో ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యేవాడు. దాంతో అమీర్ ఖాన్ తండ్రి నిర్మాత తాహీర్ హుస్సేన్ అమీర్ ఖాన్ ను ఎప్పుడు తిట్టేవారట. దాంతో నాటకాలపై ఆసక్తి ఉన్న అమీర్ ఖాన్ అటువైపు అడుగులు వేశాడు. ఆ సమయంలోనే ఎఫ్ టి ఐ ఐ విద్యార్థులు ఒక షార్ట్ ఫిలిం లో అమీర్ ఖాన్ ను నటించమని అడిగారట. ఇక ఆ నాటకంలో అమీర్ ఖాన్ తన యాక్టింగ్ టాలెంట్ తో అందరిని ఆకట్టుకోవడంతో సినిమాలలో నటించే అవకాశం వచ్చింది.