Animal Movie : సందీప్ రెడ్డి వంగ తీసిన అనిమల్ సినిమా మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్న బాలీవుడ్ స్టార్ డైరెక్టర్…

సందీప్ లాంటి మేకర్స్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరు’’ అని అనురాగ్ కశ్యప్ గురించి చాలా గొప్పగా చెప్పడం అనేది బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది...

Written By: NARESH, Updated On : May 16, 2024 8:40 pm

Bollywood star director Anurag Kashyap praised Sandeep Reddy Vanga's Animal movie

Follow us on

Animal movie : ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ కొంతవరకు డల్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ స్టార్ హీరోలు గా గుర్తింపు పొందిన ఖాన్ త్రయం చేస్తున్న సినిమాలు కూడా అక్కడ ఎటువంటి మ్యాజిక్ ను రిపీట్ చేయడం లేదు. అందువల్లే బాలీవుడ్ జనాలు తెలుగు సినిమాల వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు అన్నది వాస్తవం.

ఇక ఇదిలా ఉంటే తెలుగు స్టార్ డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డివంగా బాలీవుడ్ కి వెళ్లి అక్కడ రన్బీర్ కపూర్ తో చేసిన అనిమల్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక ఈ సినిమా రన్బీర్ కపూర్ కెరియర్ లోనే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీని ఆదుకుంది అని అనుకోవడం మానేసి బాలీవుడ్ లో ఉన్న స్టార్ సెలబ్రిటీస్ మొత్తం ఈ సినిమా పైన నెగిటివ్ కామెంట్లు చేయడం అయితే మొదలుపెట్టింది.

అందువల్లే సందీప్ రెడ్డి వంగా కూడా ఓపెన్ గా ఒక్కొక్కరికి కౌంటర్లు ఇస్తూ వచ్చాడు. అయితే ఇంతకుముందు అనురాగ్ కశ్యప్ కూడా సందీప్ రెడ్డి వంగని విమర్శించాడు. కానీ ఈ మధ్య తనతో ఇంటరాక్షన్ అయిన అనురాగ్ కశ్యప్ తాజాగా సందీప్ రెడ్డి వంగ గురించి మాట్లాడుతూ ‘‘నేను తనని టోటల్ గా మిస్ అండర్ స్టాండింగ్ చేసుకున్నాను. ఆయన అనిమల్ అనే ఒక కల్ట్ క్లాసికల్ సినిమాను తీశారు. ఈ సినిమా ఇంపాక్ట్ సినిమా ఇండస్ట్రీ పైన ఒక ఐదు నుంచి పది సంవత్సరాల వరకు ఉంటుంది. ఆయన చూపించిన ఇంపాక్ట్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. ఆయన మీద మొదట్లో కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేసినప్పటికీ ఇప్పటికి నా తప్పు నేను తెలుసుకున్నాను. సందీప్ లాంటి మేకర్స్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరు’’ అని అనురాగ్ కశ్యప్ గురించి చాలా గొప్పగా చెప్పడం అనేది బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది…