Pushpa 2: The Rule : పుష్ప 2 రిలీజ్ వాయిదా పడనుందా..? దీనికి కారణం ఎవరు..?

ఒకవేళ ఆంటోని కోసం కనుక వెయిట్ చేసినట్లయితే ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. చూడాలి మరి ఈ సినిమా విషయం లో సుకుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది...

Written By: NARESH, Updated On : May 16, 2024 8:48 pm

Pushpa 2 The Rule

Follow us on

Pushpa 2: The Rule : పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాల మధ్య రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమా పుష్ప 2.. అయితే ఈ సినిమా మీద తెలుగులో కంటే బాలీవుడ్ లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక మొదటి పార్ట్ బాలీవుడ్ లో భారీ విజయాన్ని అందుకోవడమే దానికి ముఖ్య కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా మొదటి పార్ట్ తెలుగులో అంత పెద్దగా ఆడకపోయినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం భారీ విజయాన్ని సాధించింది. ఇక మన మేకర్స్ కూడా వాళ్లను టార్గెట్ చేసే పుష్ప 2 సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక దాన్ని బట్టి చూస్తే ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టే విధంగా ముందుకు కదలబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టిజర్ ప్రేక్షకులను విపరీతంగా అలరించడమే కాకుండా ఈ సినిమా మీద ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. ఇక దానికి తోడుగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా నుంచి ఎడిటర్ ఆంటోనీ రూబెన్స్ తప్పుకున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది.

ఇక ఆయన వేరే సినిమాలకి ఎడిటింగ్ కి కమిట్ అవ్వడం ఆ సినిమాకి ఈ సినిమాకి మధ్య డేట్స్ విషయంలో క్లాశెస్ రావడం వల్లే తను సినిమా నుంచి తప్పుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈయన ప్లేస్ లో నవీన్ నూలిని పెట్టి సినిమా మొత్తం ఎడిటింగ్ కంప్లీట్ చేయాలని సుకుమార్ భావిస్తున్నాడు. కానీ ఆంటోని రూబెన్స్ చేసినట్టుగా ఎడిటింగ్ ను నవీన్ నూలి చేస్తాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

కాబట్టి ఆంటోని రూబెన్స్ కోసం వెయిట్ చేస్తారా లేదా నవీన్ నూలీ తో కంటిన్యూ చేసి అనుకున్న డేట్ కి రిలీజ్ చేస్తారా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ ఆంటోని కోసం కనుక వెయిట్ చేసినట్లయితే ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. చూడాలి మరి ఈ సినిమా విషయం లో సుకుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది…