AR Rahman divorce case : ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్(AR Rahman) తన భార్య సైరా భాను(Saira Bhanu) తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీ కపుల్ విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియా లో చర్చలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎందుకు విడాకులు తీసుకున్నారు అనేది ఎవ్వరూ కారణాలు చెప్పారు కాబట్టి, ఎవరికీ తోచింది వాళ్ళు రాసుకుంటూ పోతుంటారు. ఆడియన్స్ కూడా ఇలాంటి అంశాలపై అమితాసక్తిని చూపిస్తుంటారు, వాటి పై ఎన్ని కథనాలు ప్రచురించినా మంచి రేటింగ్స్ వస్తుంటాయి కాబట్టి అస్సలు ఆ అవకాశాన్ని వాడుకులోరు. సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్నప్పుడు ఇలాంటివి మనం ఎన్నో చూసాము. ఇప్పుడు AR రెహమాన్ విషయం లో కూడా చూస్తున్నాం. అయితే రెహమాన్ తన భార్య కి విడాకులు ఇవ్వడానికి కారణం,, తన టీంలో ఉన్న ఒక వ్యక్తితో సైరా రిలేషన్ పెట్టుకోవడం వల్లే అంటూ ఒక ప్రచారం జరిగింది.
ఈ ప్రచారం రెహమాన్ వరకు చేరడంతో, ఆయన తరుపున న్యాయవాది చాలా ఘాటుగా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా స్పందిస్తూ ఒక నోటీసు ని విడుదల చేసాడు. ఎవ్వరైనా ఈ విడాకుల వ్యవహారం లో అసత్య ప్రచారాలు చేస్తే , వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, ఇక నుండి జాగ్రత్తగా ఉండాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవలే సైరా గారికి అనారోగ్యం వచ్చి ఆసుపత్రి పాలైంది. ఆ సమయంలో ఏఆర్ రెహమాన్ గారు దగ్గరుండి ఆమెని చూసుకున్నారు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. విడాకులు తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ మధ్య ఇంత సాన్నిహిత్యం ఉందని చెప్పుకొచ్చాడు. మరి ఇంత సాన్నిహిత్యం ఉన్నప్పుడు త్వరలోనే వీళ్లిద్దరు తమ విడాకులు రద్దు చేసుకోబోతున్నారా..?, అందుకు సంకేతంగానే రెహమాన్ న్యాయవాది ఇలాంటి పోస్టులు వేసారా అని అంటున్నారు అభిమానులు. ఏది ఏమైనా వాళ్లిద్దరూ మళ్ళీ కలిసిపోవాలని మేమంతా కోరుకుంటున్నాము అంటూ అభిమానులు కామెంట్స్ రూపం లో తెలియచేసారు.
ఇక రెహమాన్ సినిమాల విషయానికి వస్తే రీసెంట్ గానే ఆయన ‘చావా’ మూవీ కి సంగీత దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే . దేశవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ పరంగా సెన్సేషన్ సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతున్న ఈ సినిమాకి రెహమాన్ సరిగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వలేదని అభిమానుల నుండి ఒక కంప్లైంట్ ఉంది. గూస్ బంప్స్ రప్పించే ఎన్నో సన్నివేశాలకు, రెహమాన్ సరిగా డ్యూటీ చేసి ఉంటే వాటి రేంజ్ వేరే లెవెల్ కి వెళ్లి ఉండేదని అంటున్నారు. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్(Global Star Ramcharan), బుచ్చి బాబు(Buchhi Babu Sana) సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. రీసెంట్ గానే షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టుకున్న ఈ సినిమాకి, ఫామ్ లో లేని రెహమాన్ పై అభిమానుల్లో కాస్త భయం ఏర్పడింది. కానీ వాడుకునే డైరెక్టర్ ని బట్టి కూడా రెహమాన్ మ్యూజిక్ ఉంటుంది. బుచ్చి బాబు కి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది కాబట్టి కచ్చితంగా ఆయన ది బెస్ట్ ఔట్పుట్ ని రాబట్టుకుంటాడని రామ్ చరణ్ అభిమానులు ఆశిస్తున్నారు.
View this post on Instagram