Pushpa 2: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఎప్పుడైతే పుష్ప సినిమా వచ్చిందో అప్పటినుంచి పాన్ ఇండియాలో ఆయన కూడా వన్ ఆఫ్ ది టాప్ హీరోగా ఎదిగిపోయారు. పుష్ప సినిమా దాదాపు 400 కోట్లకు పైన కలెక్షన్లను వసూలు చేసి ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ మూవీగా నిలిచింది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ‘పుష్ప 2’ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని మేకర్స్ అనౌన్స్ చేసినప్పటికీ, సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కానందున ఈ సినిమాను డిసెంబర్ 6వ తేదీ కి పోస్ట్ పోన్ చేశారు. నిజానికైతే ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన వస్తుందని చాలా సినిమాలు పోస్ట్ పోన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా డిసెంబర్ 6 వ తేదీన వస్తుండడంతో అదే రోజున బాలీవుడ్ నుంచి రెండు సినిమాలు రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘స్కై ఫోర్స్’ సినిమా ఒకటి కాగా, విక్కీ కౌశల్ హీరోగా వస్తున్న ‘చావా ‘ సినిమా మరొకటి…ఛత్రపతి శివాజీ కొడుకు అయిన శంభాజీ కి సంబంధించిన చారిత్రక నాటకం ద్వారా ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు… ఇప్పటికే ఆ తేదీన పుష్ప సినిమా వస్తుందని మేకర్స్ అనౌన్స్ చేసినప్పటికీ సినిమా ప్రొడ్యూసర్స్ మాత్రం ఎక్కడా తగ్గకుండా అదే తేదీన రావాలని పట్టు పట్టుకొని కూర్చున్నట్టుగా తెలుస్తుంది.
అయితే పుష్ప 2 సినిమా ఇప్పటికే ఆగస్టు 15 వ తేదీన వస్తానని చెప్పి పోస్ట్ ఫోన్ అయింది. కాబట్టి డిసెంబర్ 6వ తేదీన కూడా వచ్చే క్లారిటీ అయితే లేనట్టుగా తెలుస్తుంది. ఇక ఆ ఉద్దేశంతోనే చావా ప్రొడ్యూసర్స్ ఈ సినిమాని డిసెంబర్ 6వ తేదీకి తీసుకురావాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి పుష్ప 2 సినిమా మరోసారి పోస్ట్ పోన్ అవుతుందా? లేదంటే అనుకున్న తేదీకి తీసుకొస్తారా? అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది. ఇక ఇప్పటికే పుష్ప సినిమా మీద రోజు రోజుకి అంచనాలు తగ్గిపోతున్నాయి.
ఇక మరోసారి పుష్ప 2 సినిమా డేట్ ని కనక పోస్ట్ ఫోన్ చేసినట్లయితే ఈ సినిమా మీద ఉన్న అంచనాలు కాస్త ఆవిరైపోతాయి అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇప్పటికే సినిమా హీరోలందరూ వరుసగా వచ్చి మంచి విజయాలను అందుకుంటుంటే అల్లు అర్జున్ మాత్రం మూడు సంవత్సరాల కిందట వచ్చిన పుష్ప సినిమా తర్వాత మరోసారి స్క్రీన్ మీద కనిపించలేదు. కాబట్టి అతని అభిమానులు కూడా ఆయన సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
ఆయన సినిమాలని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వెళ్తే మాత్రం ఫైనల్ గా ఆయనకు భారీ నష్టం వాటిల్లే అవకాశం అయితే ఉంది… ఇక ఇప్పటికైన పుష్ప 2 సినిమా మీద భారీ కసరత్తులు చేసైన సరే ఆ సినిమాను అనుకున్న తేదీకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి. లేకపోతే మాత్రం అల్లు అర్జున్ క్రేజ్ అనేది భారీగా తగ్గిపోవడమే కాకుండా సినిమాకి భారీ రేంజ్ లో బజ్ అయితే ఉండదు. ఇక దానివల్ల ఈ సినిమాకి ఓపెనింగ్స్ విషయంలో భారీగా దెబ్బ పడే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక పుష్ప 2 తో పోటీకి వస్తే మాత్రం చావా సినిమాకి భారీ దెబ్బ పడే అవకాశాలైతే ఉన్నాయి…