Rajamouli: తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి…ప్రస్తుతం పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధిస్తున్న మన తెలుగు సినిమాలు ఒకప్పుడు బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్నాయి. ప్రతి బాలీవుడ్ హీరో తెలుగు సినిమాలని చాలా చులకనగా చూసేవారు. ముఖ్యంగా బాలీవుడ్ మాఫియా నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చేది. ఒక తెలుగు సినిమా రిలీజ్ అయింది అంటే చాలు దానిమీద విపరీతమైన కామెంట్లు చేసేవారు. అలాంటి బాలీవుడ్ మాఫియాను తొక్కి పెడుతూ రాజమౌళి చేసిన బాహుబలి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించింది. అయితే దీని మీద కూడా బాలీవుడ్ విషం కక్కే ప్రయత్నం చేసినప్పటికి ఈ సినిమా మౌత్ పబ్లిసిటీతో సక్సెస్ ఫుల్ గా నిలిచింది… ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో మరోసారి పాన్ వరల్డ్ ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
Also Read: ఎన్టీఆర్ కెరియర్ ను మార్చేసిన ముగ్గురు డైరెక్టర్స్ వీళ్ళేనా..?
తను అనుకున్నట్టుగానే ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని తన సినిమాతో కట్టిపడేసినట్టయితే మాత్రం ఆయన టాప్ డైరెక్టర్ గా ఎదగడమే కాకుండా ఇండస్ట్రీలో దర్శకుడిగా మరోసారి తన పేరు ప్రఖ్యాతలను సువర్ణ అక్షరాలతో లిఖించుకుంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా ఎదిగిన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి హీరోలు బాలీవుడ్ లో సినిమాలు చేయడానికి అవకాశాలు కరువయ్యాయి.
అక్కడున్న మాఫియా మన హీరోలను అక్కడికి ఎంట్రీ ఇవ్వకుండా వాళ్లకి అవకాశాలు రాకుండా తొక్కిపడేసే ప్రయత్నం చేశాయి. అందులో భాగంగానే మన హీరోలు బాలీవుడ్ తో మనకెందుకు తెలుగులో సినిమాలను చేసుకొని సూపర్ సక్సెస్ లను సాధిస్తే అంతే చాలు అనే రీతిలో ఓన్లీ తెలుగుకి మాత్రమే పరిమితమయ్యారు. కానీ రాజమౌళి వచ్చిన తర్వాత సినిమా క్యాలుక్యూలేషన్స్ మొత్తం మారిపోయాయి.
ఆయన బాహుబలి తో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన తర్వాత ప్రతి హీరో ప్రతి దర్శకుడు పాన్ ఇండియా సినిమాలను చేస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలాగే బాలీవుడ్ మాఫియాని సైతం షేక్ చేస్తూ సినిమాలను చేస్తుండడం విశేషం…ఇక ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా ఇప్పుడు సక్సెస్ ఫుల్ సినిమాలు చేయాల్సిన అవసరమైతే ఏర్పడింది…