Dawood Ibrahim Love Story
Dawood Ibrahim Love Story: అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంత మందికి అండర్ వరల్డ్ మాఫియా కి మధ్య మంచి సంబంధాలు ఉండేవి. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి అలాగే అండర్ వరల్డ్ మాఫియా డాన్ అయిన దావూద్ ఇబ్రహీం కి మధ్య రిలేషన్ షిప్ అనేది మొదటి నుంచి కూడా కంటిన్యూ అవుతూ వస్తుంది.ఇక చాలా మంది హీరోయిన్లతో దావూద్ ఇబ్రహీం ప్రేమయాణం కూడా నడిపాడు. ఆయన వలలో పడిన వాళ్లలో ప్రముఖ హీరోయిన్లు నిర్మాతలు దర్శకులు లాంటి వారు కూడా ఉన్నారు. నిజానికి 1993లో ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ళకి దావుద్ కారణం అంటూ అప్పట్లో వార్తలు పుష్కలంగా వచ్చాయి.
దాంతో ఒక్కసారి ప్రపంచం మొత్తం ఆయన పేరు మారుమోగింది. ఈ క్రమంలోనే ఆయన అండర్ వరల్డ్ డాన్ గా ఎదిగాడు… అయితే ప్రస్తుతం 67 సంవత్సరాల వయసు ఉన్న దావద్ అనారోగ్య పరిస్థితుల వల్ల మృతి చెందినట్లుగా కొన్ని మీడియా సంస్థలు కథనాలను వెలిబుచ్చాయి కానీ ఈ విషయాన్ని ఎవరు నమ్మడం లేదు ఎందుకంటే దావత్ ఇబ్రహీం అనారోగ్య కారణంగా హాస్పిటల్లో చేరిన విషయం వాస్తవమే కానీ ఆయన మరణించినట్టుగా వచ్చే వార్తల్లో నిజం లేదు ఆయన ఇంకా బతికే ఉన్నాడు ప్రస్తుతం పాకిస్తాన్ లోని కరాచీలో నివాసం ఉంటున్నట్టుగా భారత్ స్పష్టంగా తెలియజేస్తుంది…ఇక 1993 లో ముంబై లోని వరుస దాడులకు కారణం అయిన దావూద్ మీద భారత్ తో పాటు ఐక్య రాజ్య సమితి కూడా ఆయన్ని 2003 లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా గుర్తిస్తూ అతని తల పైన 2.5 కోట్ల డాలర్ల రికార్డ్ ని కూడా ప్రకటించింది.
ఇక ఇది ఇలా ఉంటే దావూద్ వల్ల తన కెరియర్ ని కోల్పోయిన హీరోయిన్ ఎవరు అంటే మందాకిని…బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఈమె 1980-90 సంవత్సరాల్లో మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ముఖ్యంగా ఆమె రాజ్ కపూర్ తీసిన ‘రామ్ తేరీ గంగా మైలీ’ సినిమాతో మంచి గుర్తింపుని సంపాదించుకుంది. ఇక అప్పటినుంచి ఆమెకు ఇండస్ట్రీలో మంచి ఆఫర్లు రావడంతో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు ను సంపాదించుకుంది. ఇక ఆ సమయంలో ఆమె దావూద్ ఇబ్రహీంతో సనిహితం గా ఉంటూ ఇద్దరు కలిసి ముంబై మొత్తం చట్టపట్టలేసుకుంటూ తిరగడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇక వీళ్లిద్దరూ కలిసి ఒక స్టేడియంలో మ్యాచ్ చూస్తున్నప్పుడు తీసిన ఫోటో ఒకటి బయటికి రావడంతో అప్పటికి నేర చరిత్రలో భాగమైన దావూద్ తో పాటు తిరుగుతున్న మందాకిని కి కూడా ఆ నేర చరిత్రలో భాగం ఉంది అంటూ ఆమెని సినిమాల్లో తీసుకోవడం మానేశారు.ఇంక దానితో ఆమె సినిమా కెరియర్ అనేది టోటల్ గా క్లోజ్ అయిపోయింది… ఇక దాంతో ఆమె ప్రముఖ వైద్యుడు అయిన కాగ్యూర్ రింపోచే ఠాకూర్‌ను వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇనాయ, రబిల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.