Bollywood Hero : కానీ తనకున్న పేదరికం తన క్రికెట్ కలలను తుడిచేసింది. దాంతో వీధుల్లో ఏసి రిపేరింగ్ పనులు చేసి తన పొట్టను నింపుకునేవాడు. ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్వయంకృషితో అడుగుపెట్టి ఎదిగిన సినీ తారలు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ప్రస్తుతం ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాలెంటెడ్ హీరో కూడా ఒకరు. ఇతనికి సినిమా ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేరు. అయినా కూడా ఎంతో కష్టపడి స్టార్ నటుడిగా ఎదిగాడు. మన దేశ సినిమాల్లోనే కాకుండా బ్రిటీష్, అమెరికన్ సినిమాలలో కూడా నటించి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే గర్వించదగిన స్టార్ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 30 ఏళ్ల తన సినిమా కెరియర్ లో పద్మశ్రీ, జాతీయ ఉత్తమ నటుడి అవార్డుతో పాటు ఫిలిం ఫేర్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. విమర్శకుల నుంచి కూడా తన నటనకు ప్రశంసలు అందుకున్నాడు.
Also Read : 51 ఏళ్ల వయసులో కూడా సింగిల్ గా ఉంటున్న హాట్ బ్యూటీ.. స్పెషల్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్..
ఈ విధంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ నటుడు అతి చిన్న వయసులోనే ఎవరు ఊహించని విధంగా ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ప్రాణాంతకమైన క్యాన్సర్ కారణంగా 53 ఏళ్లకే ఈ లోకాన్ని విడిచి పెట్టాడు ఈ స్టార్ నటుడు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో మన మధ్యన లేకపోయినా కూడా తన సినిమాల రూపంలో ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ హీరో మరి ఎవరో కాదు లెజెండరీ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్. ఒకప్పుడు బాలీవుడ్లో ఒక వెలుగు వెలిగిన ఇర్ఫాన్ ఖాన్ తన చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడ్డాడు. సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకముందు జైపూర్ లో ఏసీ రిపేరు ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.
ఆ తర్వాత ముంబైలో ఏసీ రిపేర్ టెక్నీషియన్ గా పనిచేసేవాడు. నటనపై తనకున్న ఆసక్తితో తన తండ్రి చనిపోయిన తర్వాత ఆర్థిక సమస్యలు చుట్టుముడుతున్న కూడా తన కలల వైపు దృష్టి పెట్టాడు. ఇలా హిందీలో పీకు, ది లంచ్ బాక్స్, స్లమ్ డాగ్ మిలియనీర్, పాన్ సింగ్ తోమర్ వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. అలాగే లైఫ్ ఆఫ్ పై, ది అమేజింగ్ స్పైడర్ మాన్, జురాసిక్ పార్క్ వంటి పలు హాలీవుడ్ సినిమాలలో కూడా నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా కెరియర్ బాగా పీక్స్ లో ఉన్న సమయంలోనే క్యాన్సర్ మహమ్మారి బారిన పడిన స్టార్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ రెండేళ్లు క్యాన్సర్ తో పోరాడి శాశ్వతంగా ఈ లోకం విడిచిపెట్టాడు. ఇర్ఫాన్ ఖాన్ తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సైనికుడు సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
View this post on Instagram