https://oktelugu.com/

Surya: సూర్య కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ డైరెక్టర్స్…కారణం ఏంటంటే..?

తమిళం లో చాలా మంది హీరోలు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే ఇక్కడ మంచి క్రేజ్ అయితే దక్కుతుంది...ఇక తమిళ్ నుంచి పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : September 11, 2024 / 01:19 PM IST

    suriya-1

    Follow us on

    Suriya: తమిళ్ సినిమా ఇండస్ట్రీ అనగానే ‘రజినీకాంత్’, ‘కమల్ హాసన్’ పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే వీళ్లిద్దరూ ఇండియా లోనే టాప్ హీరోలుగా ఎదిగిన విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా రజనీకాంత్ మాస్ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న సమయంలో కమల్ హాసన్ ఆర్ట్ సినిమాలు చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక వీళ్లిద్దరి తర్వాత సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో సూర్య ఒకరు. ఇక ప్రస్తుతం ఆయన ‘కంగువా ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రావడం విశేషం…ఇక ఇలాంటి సందర్భంలో ఆయన చేస్తున్న సినిమాల పట్ల ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి కంగువా సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ సినిమాతో ఆయన భారీ సక్సెస్ ని సాధిస్తే ఆయన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ అవ్వడమే కాకుండా పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ అయిన తమిళ్ హీరోగా కూడా ఆయన మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు.

    ఇక ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ని చూసిన బాలీవుడ్ దర్శకులు సైతం సూర్య తో సినిమా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ దర్శకులందరూ అక్కడి హీరోల కంటే కూడా సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు.
    ముఖ్యంగా తెలుగు హీరోల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కానీ మన హీరోలందరూ దాదాపు రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు బిజీగా ఉన్న నేపధ్యం లో తమిళ్ హీరోల మీద బాలీవుడ్ దర్శకులు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక రాజ్ కుమార్ హిరాని లాంటి దర్శకుడు సైతం సూర్య ని హీరోగా పెట్టి ఒక సినిమా చేయాలనే ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఆ సినిమాకి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే సూర్య మాత్రం తెలుగు సినిమా దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.

    కానీ తెలుగు వాళ్ళు మాత్రం మన హీరోలతోనే సినిమాలు చేయాలని చూస్తున్నారు…ఇక రాజ్ కుమార్ హిరాని ఇంతకు ముందు ప్రభాస్ తో సినిమా చేయాలనే ప్రణాళికలను రూపొందించుకున్నాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. దానితో సూర్య మీద ఆయన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది…