Neeraj Pandey : భారీ అంచనాలతో వచ్చి ప్లాప్ ను మూటగట్టుకున్న మరో బాలీవుడ్ డైరెక్టర్…

ప్రస్తుతం బాలీవుడ్ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. వాళ్ల నుంచి ఒక సినిమా వస్తుందంటే అక్కడి ప్రేక్షకుల్లో మంచి అంచనాలనైతే పెట్టుకుంటున్నారు. కానీ ఫైనల్ గా ఆ సినిమాలు నిరాశ పరుస్తున్నాయి...

Written By: Gopi, Updated On : August 5, 2024 1:10 pm
Follow us on

Neeraj Pandey : బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది టాలెంటెడ్ డైరెక్టర్లు ఉన్నారు. ఇక అందులో నీరజ్ పాండే ఒకరు. ఒక చిన్న పాయింట్ ను తీసుకొని దానిమీద ఒక పెద్ద స్టోరీని రాసి దాన్ని సక్సెస్ ఫుల్ గా ప్రజెంట్ చేయడంలో ఆయనకు చాలా మంచి పేరుంది. ఇక ఆయన 2008లో ఏ వెడ్నెస్ డే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇక ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో బాలీవుడ్ లో తన పేరు మరుమ్రోగిపోయిందనే చెప్పాలి. ఆ తర్వాత స్పెషల్ చబ్బీస్, బేబీ వంటి సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. ఇక క్రికెట్ దిగ్గజం అయిన ధోని బయోపిక్ గా ఆయన చేసిన ఎమ్మెస్ ధోని అనే సినిమాని తెరకెక్కించి ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేశాడు. ఇక ఆ తర్వాత ఆయన ఓటిటి ప్లాట్ఫామ్ మీద కొన్ని వెబ్ సిరీస్ లు చేసి ప్రేక్షకులను అల్లరించే ప్రయత్నం చేశాడు. ఇక అజయ్ దేవగన్, టబు లను మెయిన్ లీడ్స్ గా పెట్టి ‘ఔరోన్ మే కహాన్ దమ్ థాతో’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి అది ఆశించిన విజయాన్ని సాధించలేక పోయింది. ఇక ఇంతకు ముందు నీరజ్ పాండే నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉండేవి. కానీ ఆ అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది.

ఇక మొదటి నుంచి కూడా ఈ సినిమాలోని సాంగ్స్ కానీ, ట్రైలర్ గానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా లేకపోయినప్పటికి కేవలం నీరజ్ పాండే సినిమా అనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమా మీద భారీ అంచనాలు పెంచుకున్నారు. కానీ వాళ్ళ ఆశలను నిరాశ చేస్తూ ఈ సినిమా దారుణమైన రిజల్ట్ ను ఇచ్చిందనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ దర్శకులందరూ భారీ సక్సెసులను కొడుతుంటే బాలీవుడ్ లో ఉన్న ప్రతి దర్శకుడు కూడా సక్సెస్ ఫుల్ సినిమాలను తీయడం లో ఫెయిల్ అయిపోతున్నారు.

ఇక నీరజ్ పాండే కూడా అదే రీతిలో సినిమా తీసి మరొకసారి బాలీవుడ్ పరువు ప్రతిష్టలను తీస్తున్నాడని కొంతమంది బాలీవుడ్ సినీ క్రిటిక్స్ సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు… నిజానికి బాలీవుడ్ లో ఉన్న డైరెక్టర్లు మంచి సినిమా చేసి సక్సెస్ అందుకోవాలనే ప్రయత్నం చేసిన కూడా అది వర్కౌట్ అవ్వడం లేదు. ఇక మీదట వచ్చే బాలీవుడ్ సినిమాలైనా సక్సెస్ ఫుల్ గా సాగుతాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక చాలా రోజుల గ్యాప్ తర్వాత థియేటర్ లో రిలీజ్ చేసిన సినిమా ఫ్లాప్ అవ్వడం చాలా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి…

ముఖ్యంగా నీరజ్ పాండేకి ఎంఎస్ ధోని బయోపిక్ తో మంచి గుర్తింపు అయితే వచ్చింది. ఇక దాన్ని వాడుకోవడంలో ఆయన కొంతవరకు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఇక దాంతో సినిమాలు చేయకుండా ఓటిటి ప్లాట్ ఫామ్ కి వెళ్లి పోవడమే ఆయన చేసిన పెద్ద మిస్టేక్ గా కొంతమంది సినీ మేధావులు చెబుతున్నారు… ఇక ఏది ఏమైనప్పటికి బాలీవుడ్ ఇండస్ట్రీకి ఇప్పుడు బ్యాడ్ టైమ్ అయితే నడుస్తుంది. కాబట్టి వీళ్ళు మంచి సినిమాలు చేసి సక్సెస్ సాధించాలని కోరుకుందాం…