Bollywood Crazy Updates: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ బాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం సినిమాల కంటే ఆయన చేస్తున్న చేష్టలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. వర్మ తరచూ ఏదో ఒక అంశంతో వివాదాల్లో నిలుస్తున్నారు. అంతే కాకుండా పబ్బుల్లో హీరోయిన్లతో డ్యాన్సులు చేస్తున్న వీడియోలను షేర్ చేస్తూ సంచలనాలు రేపుతున్నాడు. రీసెంట్‌గా టాలీవుడ్‌కు చెందిన ఓ నటితో వర్మ చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియో పై నెటిజన్లు మండిపడుతున్నారు.
Me cigaretting and grooving with the super lovely @inaya_sultana at #GreaseMonkey pic.twitter.com/EdesClOpkv
— Ram Gopal Varma (@RGVzoomin) January 27, 2022
Also Read: చలికి గడ్డకట్టి అమెరికా సరిహద్దులో భారత కుటుంబం దుర్మరణం.. మృతుల్లో చిన్నారి
ఇక మరో మూవీ అప్ డేట్ విషయానికి వస్తే.. బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆలియా భట్ నటించిన ‘గంగూబాయి కతియావాడి’ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఫిబ్రవరి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. జనవరి 6న విడుదల చేస్తామని గతంలో చెప్పింది. కాగా.. ఈ సినిమాను సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
#GangubaiKathiawadi will rise to power in cinemas near you on 25th February, 2022 🤍#SanjayLeelaBhansali @ajaydevgn @prerna982 @jayantilalgada @PenMovies @bhansali_produc @saregamaglobal https://t.co/y0Uab2hh6W
— Alia Bhatt (@aliaa08) January 28, 2022
ఇక మరో వైరల్ అప్ డేట్ విషయానికి వస్తే.. రొమాంటిక్ సీన్ల విషయంలో బాలీవుడ్ నటి దీపిక పదుకొణె తనదైన స్టైల్‌లో స్పందించింది. సెట్స్ లో అందరి ముందూ రొమాంటిక్ సీన్స్ చేయడం అంత సులభం కాదని ఇటీవల చెప్పిన ఆమె.. ఈసారి ముద్దు సీన్ల గురించి మాట్లాడింది. ‘గెహ్రాహియాలో సిద్ధాంత్ చతుర్వేదితో ఇంటిమేట్ సీన్స్‌లో నటించాను. ముద్దు సీన్లతో ప్రేక్షకులను ఎగ్జైట్ చేయాలన్న ఉద్దేశం లేదు. ముద్దులకు వయసుతో ముడిపెడితే అంగీకరించను’ అని దీపిక చెప్పింది. అయినా ‘ముద్దు సీన్లకు వయసుతో పనేంటి..? అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది.

Also Read: బెంగాల్ తరహా రాజకీయం.. గప్ చుప్ గా పని కానిచ్చేస్తున్న బీజేపీ, టీఆర్ఎస్..!