Bollywood Bold Heroine : బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఈ తెలుగు అమ్మాయి వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు కూడా తెచ్చుకుంది. సామాజిక మాధ్యమాలలో ఈమె ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇంస్టాగ్రామ్ ఖాతాలలో బికినీ, హాట్ ఫోటోలతో సందడి చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలో పద్ధతిగా కనిపిస్తున్న ఈ తెలుగు అమ్మాయి ఎవరో కనిపెట్టగలరా. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా ఫేమస్ హీరోయిన్. గతంలో ఎన్నో తెలుగు సినిమాలలో తన నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. కానీ అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. దాంతో ఈ బ్యూటీ బాలీవుడ్ వైపు వెళ్లిపోయింది. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బోల్డ్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. ముఖ్యంగా ఈమె నటించిన హిందీ ఓటిపి సినిమాలు అలాగే వెబ్ సిరీస్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. తన అందంతో పాటు అభినయంతో కూడా ఈ బ్యూటీ బాగా ఫేమస్ అయ్యింది. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ ఫోటో షూట్ లతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.
నిత్యం తన గ్లామరస్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది. బికినీ, స్విమ్ సూట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటుంది. ఈ బ్యూటీ మరెవరో కాదు శ్రేయ ధన్వంతరి. హైదరాబాదులో పుట్టిన శ్రేయ ధన్వంతరి దుబాయ్ లో పెరిగింది. ఇండియాలో ఈమె వరంగల్లో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. కెరియర్ ప్రారంభంలో మోడల్ గా కనిపించిన శ్రేయ ఆ తర్వాత తెలుగులో హీరోయిన్గా నటించే అవకాశం అందుకుంది. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన జోషి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.
సందీప్ కిషన్ హీరోగా నటించిన స్నేహ గీతం సినిమాలో కూడా శ్రేయ ధన్వంతరి సెకండ్ హీరోయిన్ గా నటించింది. కానీ ఆ తర్వాత ఆమెకు తెలుగులో అంతగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళిపోయింది. హిందీలో ఈ బ్యూటీ లూప్ లపేట, ముంబై డైరీస్ 26/11 వంటి సినిమాలలో కీలక పాత్రలలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. ది ఫ్యామిలీ మన్, స్కాం 1992 ఓటిటి వెబ్ సిరీస్ లు ఈమెకు బాగా గుర్తింపు తెచ్చాయి. గన్స్ అండ్ గులాబ్స్ వెబ్ సిరీస్ లో ఈమె నటనకు మంచి ప్రశ్నలు వచ్చాయి. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయింది.
View this post on Instagram