Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఈయూతో వాణిజ్య చర్చల గడువును జూలై 9 వరకు పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో 50 శాతం టారిఫ్ ల అమలు వాయిదా పడింది. తాత్కాలికంగా అనిశ్చితులు చల్లారడంతో ఆసియా మార్కెట్లతో పాటు మన మార్కెట్లు రాణించాయి. సెన్సెక్స్ 30 సూచీలో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్, ఐటీసీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.