https://oktelugu.com/

రైలు ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. ఆ రైళ్లు లేనట్లే..?

దేశంలో కరోనా ఉధృతి తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడటంతో ప్రయాణాలు చేసే వారి సంఖ్య గతంతో పోలిస్తే భారీగా పెరిగింది. దేశంలోని చాలామంది ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి రైలు ప్రయాణాలపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అన్ లాక్ సడలింపుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పరిమిత సంఖ్యలో మాత్రమే రైలు ప్రయాణాలకు అనుమతులను ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో తక్కువ సంఖ్యలోనే రైళ్లు నడుస్తున్నాయి. ప్రత్యేక రైళ్లు మాత్రమే అందుబాటులో ఉండటం వల్ల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 17, 2021 / 12:13 PM IST
    Follow us on

    దేశంలో కరోనా ఉధృతి తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడటంతో ప్రయాణాలు చేసే వారి సంఖ్య గతంతో పోలిస్తే భారీగా పెరిగింది. దేశంలోని చాలామంది ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి రైలు ప్రయాణాలపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అన్ లాక్ సడలింపుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పరిమిత సంఖ్యలో మాత్రమే రైలు ప్రయాణాలకు అనుమతులను ఇచ్చిన సంగతి తెలిసిందే.

    ప్రస్తుతం దేశంలో తక్కువ సంఖ్యలోనే రైళ్లు నడుస్తున్నాయి. ప్రత్యేక రైళ్లు మాత్రమే అందుబాటులో ఉండటం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెగ్యులర్ రైళ్లను సైతం అందుబాటులోకి తీసుకొనివస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పట్లో రెగ్యులర్ రైళ్లు నడిపే అవకాశం లేదని తెలుస్తోంది. సాధారణంగా దేశంలో 13,000కు పైగా రెగ్యులర్ రైళ్లు తిరిగేవి. ప్రస్తుతం రైల్వే శాఖ నడుపుతున్న రైళ్లలో పది రోజుల ముందుగానే బెర్తులు నిండుతున్నాయి.

    రిజర్వేషన్ ఉన్నవారు మాత్రమే రైలు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో 5,000కు పైగా రైళ్లు మాత్రమే నడుస్తున్నాయని తెలుస్తోంది. మరోవైపు రైలు ప్రయాణాలకు సాధారణ ఛార్జీలతొ పోలిస్తే ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారని రైలు ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెల నుంచి పూర్తిస్థాయిలో రైలు సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ మొదలు కావడంతో వ్యాక్సిన్ పంపిణీ జరిగిన తరువాత పూర్తిస్థాయిలో రైళ్ల సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని రైళ్ల సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నట్టు తెలుస్తోంది.