Ugadi 2022: తెలుగు సంవత్సరాదిగా ఉగాదిని జరుపుకుంటాం. పంచాంగ శ్రవణం ప్రధానంగా చేస్తుంటాం. మేషాది ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకుని తమ జీవితంలో భవిష్యత్ ఎలా ఉండబోతోందని అందరు ఆసక్తి చూపిస్తుంటారు. గతంలో కంటే భిన్నంగా ఉండాలని ఆకాంక్షిస్తుంటారు. తమ రాశుల ప్రభావాన్ని తెలుసుకుని మురిసిపోతుంటారు. శుభకృత్ సంవత్సరంలో అందరికి శుభాలు కలగాలని ఆకాంక్షిస్తాం. శని మకరంలో కంటే కుంభంలో సంచరించే సమయంలో బాగా అనుకూలిస్తాడని చెబుతున్నారు.

ఈ సంవత్సరం ప్రతి పనిలో జాగ్రత్తగా మసలుకోవాలని సూచిస్తున్నారు. ఆర్థిక సమస్యలు పెద్దగా లేకపోయినా ఖర్చులు సంపాదన సమంగా ఉంటాయని తెలుస్తోంది. సామాజిక కార్యక్రమాల మీద దృష్టిపెడతారని చెబుతున్నారు. వ్యాపారస్తులకు హెచ్చుతగ్గులు తప్పేలా లేవు. ఉద్యోగాల్లో స్థిరం తగ్గుతుంది. అయినా సంవత్సరంలో ఒడిదుడుకులను సమంగా చూసుకుని మసలు కోవాలని సూచిస్తున్నారు. శ్రమకు తగిన గుర్తింపు ఉండదు.
Aries: మేష రాశి వారికి అన్ని అనుకూలంగా ఉన్నాయి. రాబడి తక్కువగా వ్యయం ఎక్కువగా ఉంటోంది. పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్రాధాన్యం ఇస్తారు. ఉద్యోగంలో స్థాన చలన సూచనలున్నాయి. వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు తప్పవు. ఉద్యోగంలో స్థిరత్వం తగ్గుతుంది. పదోన్నతులు అనుకూలించవు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం దక్కదు. శ్రమకు లాభం ఉండదు. మానసిక రుగ్మతలు ఉన్నవారు చిక్కులు ఎదుర్కొంటారు.

Vṛṣabha: వృషభ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఉద్యోగాల్లో సమస్యలున్నా పదోన్నతులు మాత్రం వస్తాయి. మితభాషణ శ్రేయస్కరం. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పనిలో సమస్యలున్నా వాటిని పరిష్కరించుకునేందుకు అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎవరిని నమ్మరాదు. నేత్ర సంబంధ సమస్యలున్న వారు జాగ్రత్తగా మసలుకోవాలి.

Mithuna: మిథునరాశి వారికి గత కొద్దికాలంగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు. గతంలో చేసిన పొరపాట్లను గుర్తించి వాటిని సరిచేసుకుని ముందుకు వెళ్లాలి. శుభకార్యాల్లో పాల్గొంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త పరిచయాలు పెరుగుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. గురుబలం కారణంగా మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి.

cancer: కర్కాటక రాశి వారికి ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఖర్చులు పెరిగినా ఆదాయం సర్దుబాటు అవుతుంది. వ్యాపారులకు సమస్యలు ఎదురవుతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారులకు మంచిఫలితాలుంటాయి. అధికారులు అండదండలు ఉంటాయి. విద్యార్థులకు మంచి శుభాలున్నాయి. రైతులకు కూడా పంటలు సమృద్ధిగా ఉంటాయి. మానసిక సమస్యలు తీరుతాయి. పనుల్లో వేగం పుంజుకుంటుంది.

Simharasi: సింహరాశి వారికి ఆదాయం తక్కువగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువవుతాయి. విలువైన వస్తువులు చోరీకి గురవుతాయి. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారాల్లో ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఉండవు. పోటీ పరీక్షల్లో రాణిస్తారు. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. పాత రుణాలు ఇబ్బంది పెడతాయి.

Virgo: కన్యారాశి వారికి శ్రమకు తగిన ఫలితాలుండవు. వ్యాపారులకు లాభాలు ఉండవు. ఉద్యోగులు ఒత్తిడికి గురవుతారు. అధికారులతో తరచూ ఇబ్బందులు పడతారు. ఆరోగ్యం ఫరవాలేదనిపిస్తోంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఒంటరిప్రయాణాలు వద్దు. వ్యక్తిగత విషయాల్లో గోప్యత పాటించాలి. గతం కంటే పరిస్థితి బాగుంటుంది. మంచి మార్పులుంటాయి.

Libra: తులారాశి వారికి ఆర్థిక వ్యవహారాలు అనుకూలం. జూన్ నుంచి కుజుడు ప్రతికూలించడంతో గురువు మీనంలో సంచారం వల్ల ఆర్థిక వెసులుబాటు ఉండదు. జాగ్రత్తగా వ్యవహరించాలి. చికాకులు వస్తాయి. రుణాలు అందక ఇబ్బందులు పడతారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు అసవరం. పదోన్నతుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. విదేశీయాన ప్రయాణాలు అనుకూలించవు. విద్యార్థులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.

Scorpio: వృశ్చిక రాశి వారికి శుభకార్యాలు సూచిస్తున్నాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రుణ విషయాల్లో అనుకూలత ఉంటుంది. కొత్త ప్రయోగాలు చేయడానికి అనుకూలం. శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు ఆరోగ్యపరంగా ఇబ్బందులుండవు. రైతులకు కూడా సానుకూల ఫలితాలు సూచిస్తున్నాయి.

Sagittarius: ధనుస్సు రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. పుణ్యకార్యాల్లో కాలక్షేపం చేస్తారు. వ్యాపారులకు మంచి కాలం. విధి నిర్వహణలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. స్తిరాస్తి కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు కలిసి వచ్చే కాలం. పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. రైతులకు కూడా మంచి కాలమే అని తెలుస్తోంది.

Makara: మకరరాశి వారికి ఆదాయం తగ్గుతుంది. ఒత్తిడికి గురవుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మంచి ఫలితాలే సూచిస్తున్నాయి. అనవసర విషయాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకుంటారు. వ్యాపారులకు అంతగా అనుకూలంగా ఉండదు. వ్యాపారులకు సమస్యలు తప్పవు. రైులకు శ్రమ ఎదురైనా మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి.

Aquarius: కుంభరాశి వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. బంధువులతో కలహాలు రావచ్చు. పనులు సజావుగా సాగవు. పనులు మందకొడిగా సాగుతాయి. పాత రుణాలు తీరుుస్తారు. వ్యాపారాలు అంతగా అభివృద్ధిలో ఉండవు. ఫైనాన్స్ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు మార్గం సుగమం అవుతుంది. మంచి ఫలితాలు అందుతాయి.

Pisces: మీన రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది. రుణాలు చేస్తారు. పుణ్య క్షేత్ర సందర్శన చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకోని లాభాలు దరిచేరతాయి. ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అన్ని రంగాల వారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. వాహనాలు, నగలు, ఇళ్ల కొనుగోలుపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. శని సంచారం వల్ల అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. అలంకరణ వస్తువులు కొనుగోలుకు వ్యయం చేస్తారు.
