Khushi Mukherjee Commented On Suryakumar Yadav: ప్రముఖ యంగ్ హీరోయిన్ ఖుషి ముఖర్జీ(Kushi Mukerji) రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో స్టార్ క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్(Surya Kumar Yadav) పై చేసిన కొన్ని కామెంట్స్ సంచలనంగా మారాయి. మీరు ఒక క్రికెటర్ తో డేటింగ్ చేస్తున్నారని విన్నాను నిజమేనా అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ‘నేను ఏ క్రికెటర్ తో కూడా డేటింగ్ చేయడం లేదు. అలాంటి వాటి పై నాకు ఆసక్తి లేదు. కానీ క్రికెటర్స్ ఎక్కువగా నా వెంటపడేవారు. ఉదాహరణకు సూర్య కుమార్ యాదవ్ ఒకప్పుడు నాకు తరచూ మెసేజిలు చేస్తుండేవాడు. కానీ ఇప్పుడు మాత్రం నాకు అతను అందుబాటులో లేడు’ అంటూ చెప్పుకొచ్చింది. చక్కగా తన భార్య తో కాపురం చేసుకుంటూ సంతోశావంతమైన దాంపత్య జీవితం గడుపుతున్న సూర్య కుమార్ యాదవ్ ని చిక్కుల్లో పెట్టేలా ఖుషి ముఖర్జీ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఎంతో పద్దతిగా, సైలెంట్ గా కనిపించే సూర్య కుమార్ యాదవ్ లో ఇలాంటి టాలెంట్ కూడా ఉందా అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తుంటే, మరికొంత మాత్రం కావాలని పబ్లిసిటీ కోసం కొంతమంది హీరోయిన్లు ఇలా టాప్ సెలబ్రిటీల పేర్లను ఇలాంటి విషయాలకు వాడుకుంటున్నారు అని అంటున్నారు. రీసెంట్ గానే సూర్య కుమార్ యాదవ్ తన భార్య తో కలిసి వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల ని సందర్శించి స్వామి వారికి పూజలు నిర్వహించాడు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. కేవలం తిరుమల కి మాత్రమే కాదు, సూర్య కుమార్ యాదవ్ కి మొదటి నుండి తన సతీమణి తో కలిసి ఇలా దేవాలయాలు సందర్శించే అలవాటు ఉంది. అలాంటి మంచి వ్యక్తిపై ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదంటూ ఖుషి ముఖర్జీ పై కొంతమంది నెటిజెన్స్.
ఇంతకీ ఈ ఖుషి ముఖర్జీ విషయానికి వస్తే ఈమె MTV లో ప్రసారమయ్యే Splitsvilla అనే రియాలిటీ షో ద్వారా నార్త్ ఇండియన్స్ కి బాగా దగ్గరైంది. మోడలింగ్ రంగం లో రాణించిన ఈమె బాలీవుడ్ తో పాటు పలు టాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. హీరో నితిన్ ‘హార్ట్ అట్టాక్’ మూవీ లో కీలక పాత్ర పోషించిన ఖుషి, ఆకాష్ తో ‘దొంగ ప్రేమ’ అనే సినిమాలో హీరోయిన్ గా కూడా చేసింది. ఇక సూర్య కుమార్ యాదవ్ విషయానికి వస్తే రీసెంట్ గానే ఆయన భారత టీ20 టీం కి కెప్టెన్ గా వ్యవహరించి, న్యూజిల్యాండ్ తో జరిగిన 5 మ్యాచుల సిరీస్ లో 3-1 తేడా తో విజయం సాధించేలా చేసాడు. త్వరలోనే జరగబోయే టీ20 వరల్డ్ కప్ కి కూడా సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.