Asim Munir: భారత్–పాకిస్తాన్ మధ్య పెరిగిన టెన్షన్లు సౌదీ అరేబియాకు కొత్త ఆందోళనలు తెచ్చాయి. ఇటీవల కుదిరిన సైనిక సహకార ఒప్పందం ప్రకారం, భారతీయ దాడులకు పాకిస్తాన్ ఎదుర్కొంటే సౌదీ సైన్యం సహాయం చేస్తుందని తెలుస్తోంది. ఈ ఒప్పందం సౌదీకి ద్వంద్వ స్థితిని కలిగించింది– భారత్‌తో వాణిజ్య సంబంధాలు కాపాడుకోవాలా, పాక్‌తో సైనిక బాధ్యతలు నిలబెట్టాలా అనే సమస్య.
గాజాలో పాక్ సైనికులు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ సైనికులను గాజా ప్రాంతంలో ఉపయోగించాలనే ప్రణాళిక రచించినట్లు సమాచారం. పాక్ సైన్యాధినేత ఆసిమ్ మునీర్‌కు ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఇజ్రాయెల్ ఈ ప్రణాళికకు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పాక్ పౌరుల్లో పాలస్తీనాకు మద్దతు బలంగా ఉండటం, 3,500 మంది సైనికుల పంపితే ఇజ్రాయెల్‌కు రాజకీయ ఇబ్బందులు తప్పవని ఆ దేశం హెచ్చరిస్తోంది. ఇజ్రాయెల్ పౌరులు ‘పాక్‌ను నమ్మకూడదు‘ అని స్పష్టం చేస్తున్నారు.
బగ్రామ్ ఎయిర్‌బేస్..
బగ్రామ్ ఎయిర్‌బేస్ బంగ్లాదేశ్ భూభాగంలో కీలక ఆస్తి. దీనిని తిరిగి పొందలేకపోవటం పాక్‌కు సవాల్‌గా మారింది. ఇక్కడే బంగ్లాదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి. నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్‌సీపీ) జమాత్‌తో జతకట్టి పోటీ చేస్తోంది. ఈ సంఘం తీవ్రవాద సంబంధాల కారణంగా వివాదాస్పదం. ఎన్‌సీపీలోనే కొందరు ఈ కూటమికి వ్యతిరేకంగా ఉన్నారు. మరోవైపు తారిక్ అహ్మద్ పార్టీ కూడా ఎన్నికల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది.
బంగ్లాదేశ్ ఎన్నికలు..
బంగ్లాదేశ్‌లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే భారత స్వార్థాలకు మేలు అవుతుంది అనే చర్చ దేశవ్యాప్తంగా జోరెత్తింది ఎన్‌సీపీ–జమాత్ కూటమి అధికారంలోకి వస్తే పాక్ ప్రభావం పెరిగే అవకాశం. తారిక్ అహ్మద్ పార్టీ స్వేచ్ఛా వాగ్దానాలు చేస్తోంది. ఈ ఎన్నికలు పాక్ వ్యూహాలకు మలుపు తిప్పగలవు.
సోమాలిలాండ్‌కు ఇజ్రాయెల్ గుర్తింపు..
ప్రపంచంలో అత్యంత పేద దేశాల్లో ఒక్కటైన సోమాలియాలో సగం భాగం సోమాలిలాండ్‌గా విడిపోయింది. 1960లో ఏర్పడిన ఈ ప్రాంతాన్ని ఎవరూ గుర్తించలేదు. ఇటీవల మాత్రం ఇజ్రాయెల్ అధికారికంగా గుర్తించడం గమనార్హం. హౌతీ తీవ్రవాదులకు వ్యతిరేకంగా పోరాటంలో సోమాలిలాండ్ మద్దతు ఉపయోగపడుతుందని ఇజ్రాయెల్, అమెరికా భావిస్తున్నాయి. ఈ ఒప్పందం మధ్యప్రాచ్య రాజకీయాల్లో కొత్త సమీకరణలకు దారి తీస్తుంది.