Sudigali Sudheer Rashmi : బుల్లితెర హిట్ కాంబినేషన్ సుడిగాలి సుధీర్-రష్మీ గౌతమ్. జబర్దస్త్ వేదికగా మొదలైన వీరి ప్రేమ కహాని ఢీ డాన్స్ రియాలిటీ షో వరకు పాకింది. అక్కడకు వెళ్ళాక రెచ్చిపోయి రొమాన్స్ చేశారు. రొమాంటిక్ డ్యూయట్లు పాడుకున్నారు. గిల్లికజ్జాలు ఆడుకున్నారు. ఏళ్ల తరబడి వీరిద్దరి ప్రేమాయణం సాగింది. సుధీర్-రష్మీ లవ్ ట్రాక్స్ జనాలు పిచ్చగా ఎంజాయ్ చేశారు. పట్టుబట్టలు ధరించి గ్రాండ్ సెట్ లో సాంప్రదాయబద్దంగా పెళ్లి కూడా జరిగింది. నిజమైన పెళ్ళికి ఏమాత్రం తగ్గని సెటప్ కుదిరింది. వధూవరులుగా సుధీర్, రష్మీ మెరిసిపోయారు. వారిద్దరి ముఖాల్లో పెళ్లి కళ ఉట్టిపడింది.

ఇంత జరిగాక తూచ్ మేము ఫ్రెండ్స్ మాత్రమే అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి. సుడిగాలి సుధీర్ ఇప్పుడు అదే చెప్పి బాధపడుతున్నాడు. తాను ఎక్కడకు వెళ్లినా రష్మీ గురించి, ఆమెతో లవ్ ఎఫైర్ గురించి అడుగుతున్నారని సుడిగాలి సుధీర్ చెప్పుకొచ్చారు. సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ గాలోడు. నవంబర్ 5న చిత్ర ట్రైలర్ విడుదలైంది. గాలోడు విడుదలకు సిద్ధం అవుతుండగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా సుధీర్ పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా రష్మీతో తనకున్న బంధం పై నోరు విప్పారు.
ఎక్కడికి వెళ్లినా రష్మీ గురించి ఆడుతున్నారు. రష్మీ మీరు ప్రేమించుకుంటున్నారట కదా? అని అడుగుతున్నారు. మేము కేవలం స్నేహితులం మాత్రమే అని చెప్పినా వినడం లేదు. చాలా కాలం ఇద్దరం కలిసి పనిచేశాము. అందుకే జనాలు మా మధ్య లవ్ ఉందని అపోహపడుతున్నారు. రష్మీ నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. అంతకు మించి ఎలాంటి ఎఫైర్ మా మధ్య లేదు, అని సుధీర్ వెల్లడించాడు. దీంతో చాలా కాలంగా ప్రచారం అవుతున్న రూమర్స్ కి సుధీర్ చెక్ పెట్టినట్లు అయ్యింది.
కెరీర్ కోసం సుధీర్-రష్మీ తమను ప్రేక్షకుల్లో ప్రేమికులుగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. అది వాళ్ళు ఎదగడానికి చాలా హెల్ప్ అయ్యింది. ఇద్దరి మధ్య పరస్పర అవగాహనతోనే బుల్లితెరపై రొమాన్స్ పంచినట్లు తెలుస్తుంది. కాగా బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీతో రష్మీ హిట్ అందుకున్నారు. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక సుధీర్ నటించిన గాలోడు నవంబర్ 18న విడుదల కానుంది. దర్శకుడు రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. విడుదలైన ట్రైలర్ ఆకట్టుకోగా హిట్ ఖాయం అంటున్నారు. గాలోడు మూవీలో గెహనా సిప్పీ హీరోయిన్ గా నటించారు.