KA OTT: రాజావారు రాణిగారు, ఎస్ ఆర్ కళ్యాణమండపం వంటి చిత్రాలతో కిరణ్ అబ్బవరం వెలుగులోకి వచ్చాడు. అనంతరం ఈ యంగ్ హీరో నటించిన పలు చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ క్రమంలో ట్రోల్స్ కి గురయ్యాడు. క మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో కిరణ్ అబ్బవరం ఎమోషనల్ అయ్యాడు. క మూవీ మీకు నచ్చకపోతే ఇకపై సినిమాలు చేయను, అన్నాడు. సినిమాలో అద్భుతమైన ట్విస్ట్స్ ఉంటాయని, విజయం పై విశ్వాసం వ్యక్తం చేశాడు.
దీపావళి కానుకగా విడుదలైన క మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఏకంగా రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కిరణ్ అబ్బవరం భారీ బ్లాక్ బస్టర్ కొట్టాడు. కిరణ్ అబ్బవరం వంటి హీరో ఆ రేంజ్ వసూళ్లు రాబట్టడం మామూలు విషయం కాదు. ఇంకా పూర్తి స్థాయిలో ఈ చిత్రానికి థియేటర్స్ దొరకలేదు. క మూవీకి పోటీగా విడుదలైన అమరన్, లక్కీ భాస్కర్ సైతం హిట్ టాక్ తెచ్చుకోవడం తో క వసూళ్లు తగ్గాయి. లేదంటే దాదాపు వంద కోట్ల రేంజ్ కి ఈ చిత్రం వెళ్ళేది.
క చిత్రానికి సుజీత్ అండ్ సందీప్ దర్శకత్వం వహించారు. చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మించారు. ఇది కిరణ్ అబ్బవరం సొంత సినిమా అని సమాచారం. నయన సారిక, తన్వి రామ్ హీరోయిన్స్ గా నటించారు. శ్యామ్ సి ఎస్ సంగీతం అందించారు. కాగా క మూవీ థియేటర్స్ లోకి వచ్చి నాలుగు వారాలు కావస్తుంది. థియేట్రికల్ రన్ సైతం ముగిసింది. ఈ క్రమంలో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది.
క మూవీ ఓటీటీ హక్కులు ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. నవంబర్ 28 నుండి క మూవీ స్ట్రీమ్ కానుందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. క మూవీ కథ పరిశీలిస్తే.. ఒక కుగ్రామంలో హీరో పోస్టుమెన్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆ ఊరిలో అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. దాని వెనకున్నది ఎవరో హీరో ఎలా ఛేదించాడు అనేది కథ