Bitthiri Sathi Song: ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పనితో బిజీగా ఉండే వారు.. రాత్రి కాసేపు రిలాక్స్ కావాలని అనుకుంటారు. ఒకప్పుడు టీవీలు చూస్తూ సరదాగా గడిపిన వారు.. ఇప్పుడు మొబైల్ తో సమయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే అప్పుడు ఇప్పుడు ఇవి కాకుండా మందేస్తూ చిందేసే వారు చాలామంది ఉంటున్నారు. సాయంత్రం కాగానే పెగ్గు వేయందే కొందరికి నిద్ర పట్టదు. అదీ.. కొంతమంది స్నేహితులతో కలిసి swip చేస్తే ఇంకా ఎంజాయ్మెంట్ ఉంటుంది.. అని కొందరి భావన. ఇలాంటి వారి కోసం బిత్తిరి సత్తి పాడిన ఓ పాట వైరల్ గా మారుతుంది.. ఆ వీడియో వివరాలు ఏంటంటే?
Also Read: రెమ్యూనరేషన్ విషయంలో యాంకర్ సుమ ని దాటేసిన సుడిగాలి సుధీర్!
సాధారణంగా ఎవరైనా ఆహారం తీసుకునేటప్పుడు ముందుగా కాస్త పూజ చేసి మొదలుపెడతారు. అలాగే మందు వేసే ముందు కూడా కొన్ని మంత్రాలు చదవడం వల్ల ఎంతో హాయిగా ఉంటుందంటూ చెబుతున్నారు. అలా చేయడంవల్ల మంచి కిక్కు వస్తుందని చెబుతారు. అయితే మద్యం తీసుకునే ముందు ఎలాంటి పాట పాడాలి? అని కొందరికి సందేహం. అందుకు ప్రముఖ కమెడియన్ బిత్తిరి సత్తి ఈ పాటను అందించాడు.
బ్రాందీమాత.. విస్కీ తాత.. అంటూ సాగే ఈ పాట పూర్తయిన తర్వాత మందు తాగడం మొదలుపెట్టాలని చెబుతాడు. ఈ ప్రార్థన చేసిన తర్వాత మందు తాగడం వల్ల ఎంతో ఎంజాయ్మెంట్ ఉంటుందని చెబుతాడు. నలుగురు స్నేహితులు కలిసినప్పుడు కూడా ఇలా ప్రార్థన చేసిన తర్వాత మద్యం తీసుకోవడం వల్ల ఎంతో హాయిగా ఉంటుందని చెబుతారు. అయితే స్నేహితులు కలిసిన తర్వాత ఉల్లాసంగా మాట్లాడుతూ మందు వేస్తారు. దానికంటే ముందు ఇలా చేయడం వల్ల మరింత కామెడీగా ఉంటుందని చెబుతారు.
మానసిక ఉల్లాసం కోసం సాయంత్రం మందు వేయాలని కొందరు అనుకున్నా.. ఇది అతి అయితే మాత్రం ఆరోగ్యానికి హానికరమే అని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా నేటి కాలపు యువకులు ఎక్కువగా మద్యం మత్తులో పడి తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని అంటున్నారు. వీకెండ్ లేదా కొన్ని ప్రత్యేక రోజుల్లో మాత్రమే మద్యం తీసుకోవడం వరకు ఓకే.. కానీ ప్రతిరోజు దీనిని తీసుకోవడం వల్ల ఎంతో నష్టపోతారు. అంతేకాకుండా ప్రస్తుత కాలంలో ఉద్యోగాల కోసం తీవ్ర పోటీ ఉంటుంది. ఇలాంటి తరుణంలో ఈ విషయంలో కాస్త ఆలోచించాలి అని ఆర్థిక నిపుణులు అంటున్నారు.