Bison Movie OTT: ప్రముఖ తమిళ స హీరో ధృవ్ విక్రమ్(Dhruv Vikram) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బైసన్'(Bison Movie) రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకొని మంచి వసూళ్లను రాబట్టింది. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కోసం ధృవ్ విక్రమ్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. సుమారుగా మూడేళ్ళ వరకు ఒక్క సినిమా కూడా ఒప్పుకోకుండా, తన పూర్తి సమయాన్ని ఈ చిత్రానికే కేటాయించాడు. ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఒక యువకుడు కబడ్డీ ఆట లో ప్రావీణ్యత సాధించి, అర్జున అవార్డు ని ఎలా గెలుచుకున్నాడు అనేది డైరెక్టర్ సెల్వరాజ్ అద్భుతంగా తెరకెక్కించాడు. ధృవ్ విక్రమ్ కూడా ఈ సినిమాలో నటించలేదు, జీవించాడు అనే చెప్పాలి.
Also Read: సుకుమార్ – రామ్ చరణ్ సినిమాలో విలన్ గా నటిస్తున్న స్టార్ హీరో…
అన్ని రకాల హావభావాలు మంచి అనుభవం ఉన్న నటుడిలాగా పలికించాడు. తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకున్నాడు. అయితే ఈ సినిమా ఆయన కెరీర్ లో మొట్టమొదటి సూపర్ హిట్ గా నిల్చింది కానీ, స్టార్ హీరో అయ్యేంత పుష్ ని మాత్రం ఇవ్వలేకపోయింది. దాదాపుగా థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ని అలరించడానికి సిద్ధమైంది. సినిమా విడుదలకు ముందే నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని అన్ని భాషలకు కలిపి భారీ ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు చేసింది. నాలుగు వారాల తర్వాత ఓటీటీ లో విడుదల చేసుకునేలా డీల్ చేసుకోవడం తో, ఈ నెల 21 న ఈ చిత్రం స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. థియేటర్స్ లో ఆడియన్స్ ని గొప్పగా అలరించిన ఈ సినిమా, ఓటీటీ ఆడియన్స్ ని ఎంత మేరకు అలరిస్తుందో చూడాలి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం దాదాపుగా 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది అట.