Star Heroine : బాలీవుడ్ నటి బిపాసా బసు గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించి అలరించిన ఈ హీరోయిన్ తీవ్ర మనోవేదనకు గురైనట్టు తెలుస్తోంది. రీసెంట్‌గా కూతురు పుట్టడంతో బిపాసా బసు ఆమె భర్త కరణ్ ఎంతో హ్యాపీగా అదే విషయాన్ని తమ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అంతేకాదు తమ కూతురి కోసం ఓ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. కానీ కూతురికి వచ్చిన ఒక కష్టాన్ని చూసి ఆ దంపతులు కన్నీరుమున్నీరయ్యారు.
బిపాసా బసు కూతురి గుండెలో రెండు రంధ్రాలు ఉండడమే దానికి కారణం. నేహా ధూపియాతో జరిగిన ఒక ఇంటర్వ్యూలో బిపాసా ప్రసవ తర్వాత తాను ఎదుర్కొన్న బాధల గురించి మాట్లాడింది. తన బిడ్డకు గుండెలో రెండు రంధ్రాలు ఉన్నాయని ఆ సందర్బంలో తెలిపింది.మూడు నెలల వయసులో బలవంతంగా శస్త్రచికిత్స చేశారని నటి నేహా పేర్కొంది.
“మా ప్రయాణం సాధారణ తల్లిదండ్రుల కంటే చాలా భిన్నంగా ఉంది. ఏ తల్లికి ఇలా జరగాలని నేను కోరుకోను. నా పాప గుండెకు రంధ్రాలు ఉన్నాయని మాకు మూడు రోజుల తర్వాత తెలిసింది. చిన్నారికి నయం అవుతుందో లేదో తెలుసుకోవడానికి ప్రతి నెల గుండెకు స్కాన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. కానీ శస్త్ర చికిత్స చాలా కఠినమైనది. పెద్ద రంధ్రాలు అని.. సర్జరీ కచ్చితంగా చేయాలన్నారు వైద్యులు. కానీ మూడు నెలల వయసులో శస్రచికిత్స చాలా కష్టమని.. కానీ చివరి వరకు సర్జరీ కోసం వెయిట్ చేసి అంగీకరించాము. ” అంటూ చెప్పుకొచ్చింది బిపాస.
‘ఎంతో కాలం మానసిక సంఘర్షణ తర్వాత ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా తమ బిడ్డను కాపాడుకున్నామని… మూడు నెలల వయసులో వైద్యులతో మాట్లాడి అన్ని జాగ్రత్తలు తీసుకుని సర్జరీకి అంగీకరించాం’ అని తెలిపింది బిపాసా. తన కూతురు ఆపరేషన్ థియేటర్లో ఉన్న 6 గంటలు నా జీవితం ఆగిపోయినట్లు అనిపించిందని తెలిపింది బిపాసా.
ఇక ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఇప్పుడు తన కూతురు ఆరోగ్యంగా ఉందని.. ఇలాంటి సున్నితమైన అంశాలను ప్రతి తల్లికి తెలియాలని ఈ విషయాన్ని బయటపెడుతున్నట్లు తెలిపింది.