Biker Teaser Review: ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్న రాజశేఖర్, ఇప్పుడు తనకు హీరో గా మార్కెట్ పోయాక క్యారెక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యాడు. నితిన్ ‘ఎక్స్ ట్రా ఆర్డనినరీ మ్యాన్’ చిత్రం లో స్పెషల్ రోల్ లో కనిపించిన రాజశేఖర్, ఆ తర్వాత శర్వానంద్ ‘బైకర్ ‘ మూవీ లో కీలక పాత్ర పోషించడానికి సిద్దమయ్యాడు. నేడు ఈ చిత్రం లోని ఆయన పాత్రకు సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు. ఈ చిత్రం లో ఆయన ‘బుల్లెట్ సునీల్’ అనే క్యారెక్టర్ చేశాడు. ఈ టీజర్ లో ఆయన్ని మేకర్స్ గొప్ప ఛాంపియన్ గా చూపించారు. ఈ టీజర్ లో ఉన్న విశేషాలేంటో ఒకసారి వివరంగా చూద్దాం.
ఇందులో హీరో శర్వానంద్ ఒక బైక్ రేసర్. రాజశేఖర్ ఇందులో కోచ్ గా కనిపిస్తాడు. ఒకప్పుడు నేషనల్ వైడ్ గా జరిగిన జరిగిన రేసింగ్ పోటీల్లో 18 ఇండియన్ ఛాంపియన్ షిప్స్, 57 సౌత్ జోన్ టైటిల్స్, 100 కి రేసెస్ చేసి లెజెండ్ గా నిల్చిన ఆయన, బైక్ రేసింగ్ ని ప్రమోట్ అంతర్జాతీయ లెవెల్ లో ప్రమోట్ చెయ్యాలి అనే లక్ష్యం తో ఉన్నట్టుగా చూపించారు ఈ టీజర్ లో. మన ఇండియా లో క్రికెట్ కి ఉన్నంత క్రేజ్ ఇలాంటి స్పోర్ట్స్ కి ఉండదు, వదిలేయ్ అని ఒకరు రాజశేఖర్ కి చెప్తుండడం ఈ టీజర్ లో మనం గమనించొచ్చు. అలాంటి ఆటలో హీరో ని గొప్ప బైక్ రేసింగ్ ఛాంపియన్ గా నిలిపి గురువుగా ఎంత గోపం విజయం సాధించాడో తెలిపేలా ఇందులో హీరో రాజశేఖర్ పాత్రని తీర్చి దిద్దినట్టు తెలుస్తోంది. ఈ సినిమాని ఏప్రిల్ 3 న విడుదల చేస్తున్నారు.
ముందుగా గత ఏడాది డిసెంబర్ లో విడుదల చెయ్యాలని అనుకున్నారు కానీ, కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. ఈ సినిమాని సరిగ్గా తీసుంటే పాన్ ఇండియా లెవెల్ లో పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మన ఇండియా లో బైక్ రేసింగ్ కాన్సెప్ట్ మీద ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాలేదు. మొదటి సారి ఈ జానర్ ని టచ్ చేశారు . ఇందులో శర్వానంద్ ద్విపాత్రాభినయం చేశాడు. ఒక క్యారెక్టర్ హీరో కి తండ్రి పాత్ర గా కనిపించనుంది. ఈ సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని ఫామ్ లోకి వచ్చిన శర్వానంద్, ఈ ‘బైకర్’ చిత్రం తో తన ఫామ్ ని కొనసాగిస్తాడో లేదో చూడాలి.