Homeఎంటర్టైన్మెంట్Biker vs Rakasa collections: దయనీయమైన స్థితిలో 'బైకర్', 'రాకాస' చిత్రాలు.. 3 రోజుల్లో వచ్చిన...

Biker vs Rakasa collections: దయనీయమైన స్థితిలో ‘బైకర్’, ‘రాకాస’ చిత్రాలు.. 3 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఎంతంటే..

Biker vs Rakasa collections: సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత మన టాలీవుడ్ పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలు భారీ నష్టాలను మిగిలించడం లో ఆశ్చర్యం లేదు. కానీ సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాలకు కూడా జనాలు కదలడం లేదు. ఇదే బయ్యర్స్ ని , ట్రేడ్ విశ్లేషకులను కంగారుకి గురి చేస్తున్న విషయం. ఒక్క టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ లో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ‘ధురంధర్ 2’ చిత్రం 10 రోజుల తర్వాత వసూళ్ల పరంగా బాగా డౌన్ అయిపోయింది. ‘ధురంధర్’ చిత్రం ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దాదాపుగా 3 నెలల థియేట్రికల్ రన్ వచ్చింది. కానీ ‘ధురంధర్ 2’ కి నెల రోజుల థియేట్రికల్ రన్ కూడా వచ్చేలా కనిపించడం లేదు. అంత పెద్ద పాన్ ఇండియన్ సినిమా పరిస్థితే ఇలా ఉంటే , ఇక చిన్న సినిమాల పరిస్థితి ని ఒక్కసారి ఊహించుకోండి.

మూడు రోజుల క్రితమే శర్వానంద్(Actor Sharwanand) హీరో గా నటించిన ‘బైకర్'(Biker Movie), ‘మ్యాడ్’ ఫేమ్ సంగీత్ శోభన్(Sangeeth Sobhan) హీరో గా నటించిన ‘రాకాస'(Rakasa Movie) చిత్రాలు ఒకే రోజున విడుదల అయ్యాయి. ఈ రెండు సినిమాలకు ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ థియేట్రికల్ రన్ మాత్రం ఆ రేంజ్ లో లేదు. ముందుగా బైకర్ విషయానికి వస్తే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 21 కోట్ల రూపాయలకు జరిగింది. కానీ మూడు రోజులకు కలిపి కేవలం 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి దాదాపుగా 16 కోట్ల రూపాయిల వరకు రావాలి. ఆ రేంజ్ రన్ ఈ చిత్రానికి వచ్చే పరిస్థితులు ప్రస్తుతానికి లేవు.

ఇక ‘రాకాస’ విషయానికి వస్తే, ఈ చిత్రానికి విడుదలకు ముందే యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉండేది. ఓపెనింగ్స్ కూడా ‘బైకర్’ కంటే ఎక్కువ వచ్చాయి. ఓవరాల్ గా మూడు రోజులకు కలిపి ఈ చిత్రానికి కేవలం 6 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 13 కోట్ల రూపాయిల వరకు జరిగింది. నేటి నుండి కాస్త డీసెంట్ హోల్డ్ ని కనబరిస్తే 10 నుండి 12 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు ఫుల్ రన్ లో రావొచ్చు కానీ, పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి లాభాల్లోకి రావడం మాత్రం కష్టమే. అలా ఒకే రోజున విడుదలై పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న ఈ రెండు సినిమాల పరిస్థితి ఇంత దయనీయంగా మారింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version