Homeఎంటర్టైన్మెంట్Biker movie 15 days worldwide collections: 'బైకర్' 15 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.....

Biker movie 15 days worldwide collections: ‘బైకర్’ 15 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. హిట్ టాక్ తో ఇంత తక్కువ వసూళ్లు ఊహించలేదు..

Biker movie 15 days worldwide collections: పాపం శర్వానంద్(Actor Sharwanand) అదృష్టం ఏంటో , పుష్కరానికి ఒక హిట్ కొడుతాడు , మధ్యలో మంచి సినిమాలు చేసినప్పటికీ కూడా అవి ఆశించాయి స్థాయిలో ఫలితాలు అందించవు, కెరీర్ మొత్తం ఇలాగే సాగిపోతూ వస్తుంది. సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేస్తాడు, ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ అనుభూతిని అందించాలనే తపన ఆయన సినిమాల్లో ప్రతీ ఫ్రేమ్ లోనూ కనపడుతుంది. రీసెంట్ గా విడుదలైన ‘బైకర్'(Biker Movie) చిత్రం కూడా అలాంటిదే. ఈ సినిమా కోసం శర్వానంద్ ప్రాణం పెట్టేసాడు. సంక్రాంతికి ఎలాగో ‘నారీ నారీ నడుమ మురారి’ తో భారీ హిట్ ని అందుకున్నాడు కాబట్టి , ఆ ఊపులో ఈ మంచి సినిమాని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకున్నాడు శర్వానంద్. కానీ మార్కెట్ కి మించి బడ్జెట్ ఖర్చు చేస్తే చేతులు కాలక తప్పదని ఈ ‘బైకర్’ చిత్రంతో మరోసారి ఆయనకు బోధపడింది.

15 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం , ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టింది అనేది చూద్దాం. నైజాం ప్రాంతం నుండి 15 రోజుల్లో ఈ చిత్రానికి 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ ప్రాంతం నుండి 81 లక్షలు వచ్చాయి. సీడెడ్ లో ఇక ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ రన్ ముగిసినట్టే అనుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఆంధ్ర ప్రాంతం నుండి ఈ చిత్రానికి 3 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 15 రోజుల్లో 9 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 1 కోటి 16 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , ఓవర్సీస్ నుండి 1 కోటి 26 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 11 కోట్ల 42 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 22 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. విడుదలకు ముందు ఈ చిత్రానికి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 22 కోట్ల రూపాయిలు. అంటే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ హిట్ స్టేటస్ కి చేరుకోవాలంటే మరో 10 కోట్ల రూపాయిలు రాబట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్ ని బట్టి చూస్తే, ఈ చిత్రానికి ఫుల్ రన్ లో మరో కోటి రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి . ఒక చిన్న సినిమాకు 9 కోట్ల రూపాయిలు నష్టపోవడం అనేది చిన్న విషయం కాదు. పాజిటివ్ మౌత్ టాక్ వచ్చినప్పటికీ, ఈ చిత్రం శర్వానంద్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular